రాత్రి పది గంటల తర్వాత ప్రచారం కేసు.. చిరంజీవికి ఊరట..

0
80
chiranjeevi

chiranjeevi

మెగాస్టార్ చిరంజీవికి ఊరట లభించింది. 2014లో నమోదైన కేసు నుంచి ఆయనకు ఊరట లభించింది. రాత్రి పది గంటల తర్వాత ప్రచారం చేశారనే అభియోగాలతో కేసు నమోదైంది. అప్పట్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ, రాత్రి 10 గంటల తరువాత కూడా ప్రచారం చేశారని చిరంజీవిపై కేసు నమోదైంది.

గుంటూరు పరిధిలోని అరండల్ పేట పోలీసులు ఈ కేసును రిజిస్టర్ చేస్తూ, చిరంజీవి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారన్న అభియోగాలు నమోదుచేశారు. ఈ చార్జ్‌షీట్‌ను కిందికోర్టు పరిగణనలోకి తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ, చిరంజీవి హైకోర్టును ఆశ్రయించారు.

ఈ కేసు విచారణను న్యాయమూర్తి టీ రజని చేపట్టారు. తమ క్లయింట్ ప్రచారం ముగించుకుని వస్తుండగా, అక్రమ కేసు పెట్టారని చిరంజీవి తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ వాదనతో ఏకీభవించిన కోర్టు, కేసును కొట్టివేస్తూ తీర్పునిచ్చింది.