లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా నిలిపివేయాలి… యామిని సాధినేని ఫిర్యాదు

0
57

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను నిలిపి వేయాలని ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదికి టీడీపీ నేతలు బుద్ధా వెంకన్న, యామిని సాధినేని ఫిర్యాదు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు పరువుప్రతిష్ఠలు దెబ్బతినేలా సినిమా చిత్రీకరించారని ఆరోపించారు.

ఈ సినిమా ట్రైలర్‌లోనే చంద్రబాబును చెడుగా చూపించారని తెలిపారు. ఈ సినిమా ట్రైలర్ వీడియోను ఎన్నికల సంఘానికి అందజేశామని తెలిపారు. ఇది ఓటర్లపై తప్పకుండా ప్రభావం చూపే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికలు పూర్తయ్యేవరకు సినిమా రిలీజ్ నిలిపివేయాలంటూ విజ్ఞప్తి చేశారు.