జేసీ దివాకర్ రెడ్డి ఓవరాక్షన్… కన్నీళ్లు పెట్టుకున్న శమంతకమణి

0
82
jc-diwakar-reddy

jc-diwakar-reddy

ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి దూకుడు ఎక్కువ. ఎలాంటి వ్యవహారంపైనా నిక్కచ్చిగా మాట్లాడేందుకు వెనుకాడరు. అలాంటి వ్యక్తి ప్రజావేదికపై ఎమ్మెల్సీ శమంతకమణి, ఎమ్మెల్యే యామినీబాలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

అమరావతిలో బుధవారం నిర్వహించిన ప్రజావేదిక వద్ద ఈ వ్యవహారం చోటుచేసుకుంది. శమంతకమణి, యామినీబాల ప్రజావేదిక వద్ద ఉన్న కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డితో మాట్లాడేందుకు రాగా, జేసీ తీవ్ర వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. నోటికి వచ్చినట్లు మాట్లాడటం.. ఇష్టానికి అరవడంతో ఎమ్మెల్సీ శమంతకమణి కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. ఈ దశలో కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి జోక్యం చేసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది.

సింగనమల టికెట్‌ను బండారు శ్రావణికి ఇవ్వాలంటూ గత కొంతకాలంగా జేసీ టీడీపీ అధిష్ఠానంపై ఒత్తిడి తెస్తున్నారు. అయితే సింగనమల టికెట్ తనకే ఇవ్వాలంటూ సిట్టింగ్ ఎమ్మెల్యే యామినీబాల పట్టుబడుతున్నారు. ఈ కారణంగానే జేసీ నిప్పులు కక్కినట్టు అర్థమవుతోంది. ప్రజావేదిక సాక్షిగా జేసీ దూకుడు చూసిన ఇతర నేతలు కూడా షాకయ్యారు.