పడకను పంచుకుంటే వేషాలిస్తామన్నారు.. దంగల్ ఫేమ్ ఫాతిమా

0
71

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మీ టూ ఉద్యమంలో భాగంగా ప్రముఖ నటులు సాజిద్ ఖాన్, అలోక్ నాథ్, కైలాష్ ఖేర్, వికాస్ బెహల్, నానా పాటేకర్ లాంటి పేర్లు బయటకు రావడం సంచలనం రేపాయి. చాలా మంది హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్లు తమపై జరిగిన వేధింపులను బయటపెట్టిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో దంగల్ ఫేమ్ ఫాతీమా సనా షేక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కూడా లైంగిక వేధింపులకు గురైన బాధితురాలినేనని ఫాతీమా వెల్లడించింది. పడక పంచుకుంటే.. పక్కలోకి వస్తే వేషాలిస్తామన్నారని.. తనకు ఎదురైన పరిస్థితులను చాలా జాగ్రత్తగా డీల్ చేస్తున్నానని తెలిపింది.

తనపై వేధింపులకు పాల్పడిన వారి గురించి తాను బయటకు చెప్పను. వారి భరతం ఎలా పట్టాలో తనకు బాగా తెలుసునని ఫాతిమీ వెల్లడించింది. తన సన్నిహితులతో చర్చిస్తున్నాను. వారి సహకారం తీసుకుంటున్నాను. ఆ నరకయాతన పడిన క్షణాలకు గుణపాఠం చెబుతానని ఫాతిమా పేర్కొన్నారు. ప్రస్తుతం ఫాతిమా వ్యాఖ్యలు బాలీవుడ్‌లో పెను సంచలనానికి దారితీసింది.