మంగళగిరి నుంచి పోటీ చేయడం తన పూర్వజన్మ సుకృతమని ఏపీ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఏపీ మంత్రి నారా లోకేశ్ మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్నట్లు టీడీపీ అధిష్టానం ఖరారు చేసిన నేపథ్యంలో.. అధిష్ఠానం నిర్ణయమే శిరోధార్యమని భావించిన నారా లోకేశ్ గురువారం వ్యూహాత్మకంగా ప్రచారం మొదలుపెట్టారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, మంగళగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేయడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని వెల్లడించారు. మంగళగిరిలో ఐటీ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
అంతేకాకుండా, తన ప్రచారంలో భాగంగా నారా లోకేష్ కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఏపీ నేతలపై కేంద్రం ఐటీ దాడులు చేయిస్తూ కక్ష సాధింపు ధోరణి ప్రదర్శిస్తోందని దుయ్యబట్టారు.