16న విశాల్ – అనీషా అల్లాతో నిశ్చితార్థం

Vishal and girlfriend Anisha Alla's engagement on March 16 Confirmed

0
64
vishal - anisha
vishal - anisha

కోలీవుడ్ హీరో విశాల్ త్వరలోనే ఓ ఇంటివాడు కానున్నాడు. హైదరాబాద్‌కు చెందిన బిజినెస్ విజయ్ రెడ్డి, పద్మజల కుమార్తె అనీషా అల్లాతో ఆయన వివాహం జరుగనుంది. వీరిద్దిరి నిశ్చితార్థం ఈనెల 16వ తేదీన హైదరాబాద్‌లో ఘనంగా జరుగనుంది.

నిజానికి ప్రస్తుతం కోలీవుడ్‌లో ప్ర‌స్తుతం పెళ్ళిళ్ళ సీజ‌న్ న‌డుస్తుంది. తాజాగా, ఆర్య‌ – సాయేషాసైగ‌ల్ వివాహం జరిగింది. ఇపుడు విశాల్ వివాహం కూడా ఇక్క‌డే జ‌ర‌గ‌నుంది.

విశాల్ – అల్లా నిశ్చితార్థానికి కేవ‌లం కుటుంబ స‌భ్యులు, స‌న్నిహితుల‌ని మాత్ర‌మే ఆహ్వానించ‌నున్నార‌ట‌. ఇక‌ పెళ్ళి వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నుంద‌ని అంటున్నారు. తమిళ నటీనటుల సంఘానికి సొంత భవనం నిర్మించాకే పెళ్లి చేసుకుంటాన‌ని విశాల్ గ‌తంలో ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

ప్ర‌స్తుతం బిల్డింగ్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతుండ‌గా, వ‌చ్చే ఏడాది పూర్తి కానుంది. బిల్డింగ్ పూర్తైన త‌ర్వాత‌నే విశాల్ వివాహం చేసుకోనున్నాడ‌ని కోలీవుడ్ టాక్. ప్ర‌స్తుతం విశాల్.. ఏఆర్‌.మురుగదాస్‌ శిష్యుడు వెంకట్‌మోహన్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న అయోగ్య చిత్రంలో న‌టిస్తున్నాడు. టెంప‌ర్ రీమేక్‌గా రూపొందుతున్న ఈ చిత్రం ఏప్రిల్‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.