#RRR కథ ఇదే.. అల్లూరిగా చెర్రీ.. కొమరం భీంగా తారక్.. కథ చెప్పిన జక్కన్న

SS Rajamouli About RRR Story

0
41
RRR movie still
RRR movie still

టాలీవుడ్ టాప్ హీరోలు రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న భారీ బ‌డ్జెట్ చిత్రం “ఆర్ఆర్ఆర్”. ఈ చిత్రానికి సంబంధించి అభిమానుల‌లో ఎన్నో అనుమానాలు నెల‌కొని ఉండ‌గా, వాటికి తాజాగా క్లారిటీ ఇచ్చాడు దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి. ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్‌తో క‌లిసి ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో చిత్రానికి సంబంధించిన ముఖ్య విష‌యాలు వెల్ల‌డించాడు.

అంద‌రి కోరిక మేరకు చిత్రానికి ‘ఆర్ఆర్ఆర్’ అనే టైటిల్‌నే పెట్టాల‌ని అనుకున్నాం. ఇక ఈ చిత్ర క‌థ 1920లో ఉత్తర భారతదేశంలో జరిగే కథగా తెర‌కెక్కించ‌నున్నాను. ఇందులో యంగ్ వ‌ర్షెన్ అల్లూరి సీతారామ రాజుగా చ‌ర‌ణ్‌, యంగ్ వ‌ర్ష‌న్ కొమ‌రం భీంగా ఎన్టీఆర్ న‌టించ‌నున్నాడు. స్వాతంత్య్ర‌ సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీంలు ఒకే సమయంలో కలిసి పోరాటం చేసి ఉంటే ఎలా ఉండేది అన్న ఫిక్షనల్‌ పాయింట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా వివరించారు.

పైగా, ఈ చిత్రాన్ని అన్ని భాష‌ల‌లో ఆర్ఆర్ఆర్ అనే కామ‌న్ టైటిల్‌తో ఈ చిత్రం విడుద‌ల కానుండ‌గా, అబ్రివేష‌న్స్ మాత్రం వేరేలా ఉంటాయ‌ని రాజ‌మౌళి అన్నారు. 1920,21ల‌లో స్వాతంత్య్ర‌ సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీంలు ఒకే సమయంలో కలిసి పోరాటం చేసి ఉంటే ఎలా ఉండేది అన్న ఫిక్షనల్‌ పాయింట్‌తో సినిమాని తెర‌కెక్కిస్తున్నట్టు రాజ‌మౌళి పేర్కొన్నాడు. అయితే ఇందులో అంద‌రికి తెలియ‌ని విష‌యాల‌ని చూపించ‌బోతున్న‌ట్టు జ‌క్క‌న్న తెలిపాడు.

1897లో ఆంధ్ర‌లో అల్లూరి సీతారామారాజు పుట్ట‌గా, 1901లో ఉత్త‌ర తెలంగాణ ఆదిలాబాద్‌లో కొమురం భీం పుట్టారు. ఆంధ్ర‌, తెలంగాణ‌కి చెందిన ఇద్ద‌రు క‌లిసి నిజాం ప్ర‌భుత్వానికి వ్య‌తిరేఖంగా పోరాడారు. వీరి జీవితాల‌కి చెందిన అంశాల‌ని చాలా చ‌క్కగా చూపించేందుకు ఉత్సుక‌త‌తో ఉన్నాన‌ని రాజమౌళి అన్నాడు. అల్లూరి యుక్త వ‌య‌స్సులో ఉన్న‌ప్పుడు ఇల్లు వదిలి వెళ్లాడు. మూడు సంవ‌త్స‌రాల త‌ర్వాత తిరిగొచ్చిన ఆయ‌న ఉద్య‌మంలో పాల్గొన్నారు. ఉద్య‌మం పాల్గొన‌క ముందు ఏం జ‌రిగింద‌నేది జ‌క్క‌న్న చూపించ‌నున్నాడు. యంగ్ వ‌ర్షెన్ అల్లూరిగా చ‌ర‌ణ్ న‌టించ‌నున్న సంగ‌తి తెలిసిందే.

ఇక యుక్త వ‌య‌స్సులో ఉన్న‌ప్పుడు కొమురం భీం కూడా ఇల్లు వ‌దిలి వెళ్ళిపోయారు. ఎక్క‌డికి వెళ్ళార‌నే స‌మాచారం లేదు. తిరిగొచ్చాక విద్యాబుద్దులు నేర్చుకున్న ఆయ‌న నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా గిరిజనుల కోసం పోరాడారు. అల్లూరిలాగే కొమురం భీం పోరాడారు. వాళ్ళిద్ద‌రి చ‌రిత్రతో చేస్తున్న చిత్రం కోసం చాలా ప‌రిశోధ‌న‌లు చేసాం. యంగ్ హీరో కొమురం భీం వ‌ర్షెన్‌లో ఎన్టీఆర్‌ని చూపించ‌నున్నాం. ఆర్ఆర్ఆర్‌లో హీరో, విల‌న్ అంతా ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్‌. వారికి మిగ‌తా వారు స‌పోర్టింగ్‌గా నిలుస్తార‌ని జ‌క్క‌న్న‌ అన్నారు. దాదాపు 400 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం జూలై 30, 2020న విడుద‌ల అవుతుందని చెప్పారు.