ప్రకృతి ప్రసాదించిన కాయకూరల్లో బీన్స్ ఒకటి. వీటిలో మన శరీరానికి ఉపయోగపడే ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఎన్నో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి. ఈ క్రమంలో తరచూ బీన్స్‌ను ఆహారంలో భాగం చేసుకుంటే ఎన్నో లాభాలను పొందవచ్చు.
అయితే టైప్ 2 డయాబెటిస్ ఉన్న వారు రోజూ బీన్స్‌ను తింటే దాంతో వారి షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయని సైంటిస్టులు తాజాగా చేసిన పరిశోధనల్లో తేలింది.
బీన్స్‌లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో ఉండే గ్లూకోజ్ స్థాయిలను నియంత్రిస్తుంది. అందువల్లే బీన్స్‌ను క్రమం తప్పకుండా ఆహారంలో చేర్చుకోవడం వల్ల షుగర్‌ను అదుపులో ఉంచుకోవచ్చట.
అంతేకాదు.. బీన్స్ తినడం వల్ల జీర్ణ సమస్యలతోపాటు అధిక బరువును కూడా తగ్గించుకోవచ్చని వారు అంటున్నారు. అయితే బీన్స్‌ను ఉడకబెట్టుకుని తినడం శ్రేయస్కరం. ఎట్టి పరిస్థితిలోనూ వీటిని ఫ్రై చేసుకుని తినరాదు. ఉడికించి తింటేనే పైన చెప్పిన లాభాలు కలుగుతాయి.