పండంటి బిడ్డ కావాలా.. అయితే ఇవి ఆరగించండి…

0
48
pregnant woman
pregnant woman

చాలా మంది మహిళలు సంతానలేమితో బాధపడుతుంటారు. దీనికి అనేక కారణాలు లేకపోలేదు. దంపతుల్లో చిన్నపాటి లోపాలు కూడా సంతానలేమికి ఓ కారణంగా ఉంటుంది. అయితే, ఆరోగ్య పరంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే… మంచి పోషకాహారం తీసుకున్నట్టయితే పండంటి బిడ్డకు జన్మనివ్వొచ్చని వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు.

ముఖ్యంగా, గర్భందాల్చిన తర్వాత వైద్యుల సూచన మేరకు పోషకాహారం తీసుకోవాలని చెబుతున్నారు. గర్భంలో ఉన్న పిండం ఆరోగ్యకరమైన శిశువుగా రూపాంతరం చెందేందుకు, చక్కని ఎదుగుదలకు పోషకాహారం చాలా ముఖ్యం. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యానికి అవకాశమివ్వకుండా కడుపు పండిన ప్రతీ మహిళ తప్పనిసరిగా చక్కని ఆహారంపై దృష్టి పెట్టాలి. ఇందుకు పోషకాహార నిపుణులు ఏం సూచిస్తున్నారో తెలుసుకుందాం.

పాలకూర, క్యాలీఫ్లవర్, గుమ్మడికాయ, టమాటాలు, బీట్ రూట్, మష్ రూమ్స్, బీన్స్, పప్పు ధాన్యాలు, పుచ్చకాయ, ద్రాక్ష, కమలా, నారింజ, యాపిల్స్, స్ట్రాబెర్రీ, ముడి ధాన్యాల్లో ఐరన్ తగినంత లభిస్తుంది. మాంసాహారమైన చికెన్, మటన్ లోనూ ఐరన్ లభిస్తుంది. కాకపోతే మాంసాహార పదార్థాల్లో ఉండే ఐరన్‌ను అంత తేలిగ్గా శరీరం గ్రహించలేదు. అందుకోసం విటమిన్ సీ సప్లిమెంట్లను తీసుకోవాలి. దీంతో ఐరన్‌ను శరీరం తేలిగ్గా గ్రహించగలదు.

ప్రొటీన్లు కూడా కణాల నిర్మాణానికి అవసరమే. రెండు, మూడు త్రైమాసికాల్లో దీన్ని తీసుకోవడం తప్పనిసరి. అంటే నాలుగో నెల నుంచి ప్రొటీన్ తీసుకోవాల్సి ఉంటుంది. గుడ్లు, పాలు, పాల పదార్థాలు, బీన్స్ లో ఎక్కువగా ప్రొటీన్ లభ్యమవుతుంది.

ఫోలిక్ యాసిడ్ అన్నా ఫొలేట్ అన్నా ఒకటే. ఇది బి గ్రూపు విటమిన్. తల్లి కావాలనుకునే ప్రతి మహిళకూ అత్యంత అవసరమైన విటమిన్. గర్భంలో శిశువు ఎదుగుదలకు ఇది అత్యంత కీలకమైనది. వెన్నుపాము, మెదడుకు సంబంధించి పుట్టుకతో వచ్చే లోపాలను ఇది నివారించగలదు.