అలియాపై మనసుపడిన రాజమౌళి… ఒక్కసారి చూడగానే ఛాన్సిచ్చారట…

Alia Bhat to make Telugu debut with SS Rajamouli's RRR

0
44

దర్శకధీరుడు రాజమౌళి బాలీవుడ్ నటి అలియా భట్‌పై మనసుపడ్డారు. ఆమెను ఎయిర్‌పోర్టులో ఒక్కసారి చూసి మాట్లాడగానే ఫిదా అయిపోయారు. ఫలితంగా తాను తీస్తున్న “ఆర్ఆర్ఆర్” ప్రాజెక్టులో అవకాశం కల్పించారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన అలియా భట్ నటించనుంది.

టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లతో దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి నిర్మిస్తున్న భారీ ప్రాజెక్టు ఆర్ఆర్ఆర్. ఈ చిత్రానికి సంబంధించిన విషయాలను రాజమౌళి గురువారం మీడియాకు వెల్లడించారు. ఈ చిత్రంలో చెర్రీ సరసన బాలీవుడ్ నటి అలియా భట్‌ను ఎంపిక చేయగా, తారక్ సరసన డైసీ ఎడ్జర్ జోన్స్‌ను సెలెక్ట్ చేసినట్టు చెప్పారు.

అయితే ఆర్ఆర్ఆర్ సంస్థ త‌మ ట్విట్ట‌ర్ ద్వారా మూవీలో అలియా భ‌ట్ న‌టిస్తుంద‌ని అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టిస్తూ మార్చి 15న తేదీన బ‌ర్త్‌డే జ‌రుపుకోనున్న ఆమెకి అడ్వాన్స్ విషెస్ తెలిపింది. ఈ ట్వీట్‌కి స్పందించిన అలియా రీ ట్వీట్ చేసింది.

“ఈ రోజు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. భారీ తారాగ‌ణం, అతి పెద్ద టీంతో అంద‌మైన ప్ర‌యాణం ప్రారంభించ‌డానికి వేచి ఉండలేక‌పోతున్నాను. మీ ద‌ర్శ‌క‌త్వంలో గొప్ప అవ‌కాశం ఇచ్చినందుకు కృత‌జ్ఞ‌త‌లు అంటూ రాజ‌మౌళికి స్పెష‌ల్ థ్యాంక్స్” అంటూ తన ట్వీట్‌లో పేర్కొంది.

అయితే అస‌లు ఈ ప్రాజెక్ట్‌లో అలియా ఎంపిక ఎలా జ‌రిగింద‌నేది పాత్రికేయ‌లు స‌మావేశంలో రాజమౌళి వివరించారు. ఒక రోజు ముంబై నుండి వ‌స్తున్న స‌మ‌యంలో త‌న‌కి ఎయిర్ పోర్ట్‌లో అలియా క‌ల‌వ‌గా, అదే స‌మ‌యంలో ఆమెకి స్టోరీ వినిపించాను. వెంట‌నే తాను ఇందులో ఏ పాత్ర‌లోనైన న‌టించ‌డానికి ఓకే చెప్పిందని వివరించారు.