వేసవిలో కేశ సంరక్షణకు చిట్కాలు…

0
57
Hair Care
Hair Care

ఈ యేడాది వేసవి కాలం ఆరంభంకాకముందే ఎండలు మండిపోతున్నాయి. ఈ వేసవి కాలంలో చర్మ, కేశ సంరక్షణపై ఆందోళన మొదలవుతుంది. అయితే చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల చర్మం, జుట్టు పెళుసుగా మారకుండా చూసుకోవచ్చు. ఆ చిట్కాలేంటో తెలుసుకుందాం.

* చేతిలో ఉండే హ్యాండ్‌బ్యాగులో తప్పకుండా సన్‌స్ర్కీన్‌ లోషన్ ఉంచుకోవాలి. ఎండలోకి వెళ్లడానికి అరగంట ముందే సన్‌స్ర్కీన్‌ లోషన్‌ అప్లై చేసుకోవడం వల్ల టాన్‌ నుంచి రక్షించుకోవచ్చు.

* ఎండ జుట్టు పాడయ్యేలా చేస్తుంది. అలాగని ప్రతీరోజూ షాంపూతో స్నానం చేయడం జుట్టుకు మంచిది కాదు. తలకు స్కార్ఫ్‌లాంటివి చుట్టుకోవడం ద్వారా కొంత ఉపశమనం లభిస్తుంది.

* వారానికి ఒకసారైనా హెయిర్‌ మాస్కు వేసుకోవాలి. వేసవిలో హెయిర్‌ స్ర్పేలు వాడటం వల్ల వెంట్రుకలు ఫ్రెష్‌గా కనిపిస్తాయి.

* చర్మం పీహెచ్‌ బ్యాలెన్స్‌ చేయాలంటే గ్లిజరిన్‌ ఉన్న ఫేషియల్‌ వాటర్‌ను ఉపయోగించాలి. ఇవి చర్మాన్ని పొడిబారకుండా చేసి, మృదువుగా ఉంచుతాయి.

* ఫేస్‌వాష్‌ కూడా బ్యాగులో ఉంచుకోవాలి. సబ్బుల కన్నా దీంతో ముఖం శుభ్రం చేసుకుంటే ఎండ వల్ల వచ్చే చెమట, టాన్‌ నుంచి చర్మానికి రక్షణ లభిస్తుంది.