నిన్ను తాకే గాలి అంటే నాకెంతో ఇష్టం- సందీప్ కిలాడి

0
69
ఈ గాలి అంటే నాకు ఎంతో ఇష్టం
నన్ను తాకేముందు ఎక్కడో నిన్ను చేరి నా దగ్గరికి వస్తుందని..
పైనున్న ఈ ఆకాశమంటే నాకు ఎనలేని ఇష్టం
నాతోపాటు నిన్ను కూడా తన కిందే దాచుకుందని..
గడిచిన ఆ రోజులంటే చెప్పలేనంత ఇష్టం
నిన్ను అనుక్షణం నాకు దగ్గరగా చేశాయని..
కానీ ఎందుకో తెలియదు ఈ కాలమంటే నాకు కష్టం
నువ్వులేని నా దగ్గర కేవలం నీ జ్ఞాపకాలనే మిగిల్చింది అని..