సీఐ వచ్చేసరికి రక్తపు మరకలు చెరిపేశారు.. ఎందుకని? చంద్రబాబు ప్రశ్నల వర్షం

0
70
chandrdababu naidu

తన ఇంట్లో హత్యకు గురైన మాజీ మంత్రి, వైకాపా నేత వైఎస్. వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అనేక సందేహాలను వ్యక్తంచేశారు. వివేకా హత్యపై విచారం వ్యక్తం చేస్తూనే ఆయన మర్డర్‌పై అనేక సందేహాలను లేవనెత్తారు. సీఐ వచ్చేసరికి రక్తపుమరకలన్నీ ఎందుకు చెరిపేశారనీ చంద్రబాబు ప్రశ్నించారు.

ఎస్సార్సీపీ నేత వైఎస్ వివేకానందరెడ్డి హత్యోదంతంపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మీడియాతో మాట్లాడుతూ, వివేకా కేసులో అన్నీ అనుమానాలే కలుగుతున్నాయి. వివేకానందరెడ్డి మరణం వ్యక్తిగతంగా చాలా బాధ కలిగించింది. అయితే, ఆయన మరణం ఎంతో అనుమానాస్పదం కావడం దిగ్భ్రాంతికి గురిచేస్తోందన్నారు. ఈ వ్యవహారంలో ఆధారాలను తారుమారు చేయడానికి జరిగిన ప్రయత్నాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయని అన్నారు.

‘సాధారణంగా ఎవరైనా చనిపోతే డెడ్ బాడీని కానీ, సంఘటన స్థలాన్ని కానీ డిస్టర్బ్ చేయకూడదు. కానీ వివేకా విషయంలో అలా జరగలేదు. గుండెపోటు అని చెప్పి తలకు గుడ్డకట్టారు. ఈ వ్యవహారంలో స్టెప్ బై స్టెప్ ఆధారాలను తారుమారు చేశారు. సీఐ వచ్చేసరికి రక్తపు మరకలన్నీ శుభ్రం చేశారు. అనుమానాస్పద మృతిగా భావిస్తున్నప్పుడు పంచనామా చేస్తారని మీకు తెలియదా? ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడి డాక్టర్‌కు గుండెపోటు అని చెప్పారు.

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే… వివేకా మరణం గురించి అవినాష్ రెడ్డికి ఎలా తెలిసింది? ఎవరు మీ ఇంట్లో హత్య జరిగిన తర్వాత ఇది 5 గంటల ప్రాంతంలో జరిగిందన్నారు?. పీఏ వచ్చేసరికి 5.30 అయింది. 6.40 ప్రాంతంలో అవినాష్ పోలీసులకు ఫోన్ చేశాడు. అవినాష్ రెడ్డి ఫోన్ చేసినప్పుడు ఎవరికి చేశాడు? ఇక, వివేకాను ఆసుపత్రికి తరలించిన తర్వాత కుటుంబ సభ్యులు, బంధువులందరూ అక్కడికి వెళ్లారు.

మరి హత్య అని మొదటే ఎందుకు చెప్పలేకపోయారు? గుండెపోటు అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది? సహజమరణానికి, హార్ట్ అటాక్‌కు, హత్యకు తేడా తెలియదా మీకు? అంటే, వాళ్ల మధ్యలోనే ఏదో జరిగింది. గుండెపోటు అని పోలీసులను కూడా నమ్మించే ప్రయత్నం చేశారు. లేఖలో ఉన్న విషయాలు కూడా పొంతన లేకుండా ఉన్నాయి. డ్రైవర్‌ను త్వరగా రమ్మని పిలిచాను… చంపబోతున్నాడు అని ఉన్నట్టు చెప్పారు. డ్రైవర్ పేరును తీసుకువచ్చారంటే విషయాన్ని తప్పుదారి పట్టిస్తున్నారా?’ అంటూ చంద్రబాబు ప్రశ్నల వర్షం కురిపించారు.