ఇటీవలి కాలంలో అనేక మంది కిడ్నీల్లో రాళ్లు ఉన్నట్టు వైద్యులు గుర్తిస్తున్నారు. ఫలితంగా కిడ్నీ స్టోన్ల సమస్య చాలా మందికి వస్తున్నది. దీంతో ఏం చేయాలో తెలియిక సతమతమవుతున్నారు. స్టోన్లు బాగా పెరిగే వరకు తెలియకుండా ఉంటుండడంతో సమస్య తీవ్రతరమై ఆపరేషన్ వరకు దారి తీస్తోంది.
అయితే కిడ్నీ స్టోన్లను నిజానికి ఆరంభంలోనే గుర్తించవచ్చు. కిడ్నీలో రాళ్లు ఉన్నట్టయితే శరీరంలో కొన్ని మార్పులు సూచిస్తుంది. వాటిని గుర్తించి నిర్ధారిస్తే, కిడ్నీ స్టోన్లను ఆరంభంలోనే తొలగించుకోవడం చాలా సులభతరం అవుతుంది. మరి కిడ్నీ స్టోన్లు ఉన్నాయని తెలిపేందుకు మన శరీరంలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో తెలుసుకుందాం.
* కిడ్నీ స్టోన్లు ఉంటే వీపు కింద కుడి లేదా ఎడమ పక్కన నొప్పి వస్తుంటుంది. లేదా ముందు వైపు బొడ్డు కింద కుడి లేదా ఎడమ వైపు నొప్పి ఉంటుంది. ఆ నొప్పి కూడా పోటు పొడిచినట్లుగా వస్తుంది. దాన్ని గమనిస్తే కిడ్నీ స్టోన్లు ఉన్నాయో, లేవో చెప్పవచ్చు. ఆ
* మూత్రం పోసే సమయంలో మంట లేదా నొప్పి ఉంటే కిడ్నీ స్టోన్లు ఉన్నట్లేనని గమనించాలి.
* చక్కెర వ్యాధి ఉన్నవారికే కాదు కిడ్నీ స్టోన్లు ఉన్నవారికి కూడా తరచూ మూత్రం వస్తుంటుంది. మూత్రానికి ఎక్కువ సార్లు వెళ్తారు.
* కిడ్నీ స్టోన్లు ఉన్నవారి మూత్రం రక్తం రంగులో ఉంటుంది. లేదా కొన్ని సార్లు రక్తం కూడా పడవచ్చు. అలాగే మూత్రం దుర్వాసన కలిగి ఉంటుంది.
* కిడ్నీ స్టోన్లు ఉన్నవారికి మూత్రం ఒకేసారి రాదు. ఆగి ఆగి వస్తుంటుంది.
* వాంతికి వచ్చినట్లు ఉండడం, వికారం, వణకడం, జ్వరం రావడం వంటి లక్షణాలు ఉంటే.. కిడ్నీ స్టోన్లు ఉన్నాయని గుర్తించాలి.
* ఇలాంటి లక్షణాలు ఉన్నట్టయితే తక్షణం వైద్యులను సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకోవడమే కాదు మందులను క్రమం తప్పకుండా తీసుకోవాలి.