తమన్నా అంటే ఇష్టం.. పెళ్లి చేసుకునేవాడిని : శృతిహాసన్

Shruti Haasan says she would marry Tamannaah Bhatia if she were a man

0
156
tammu - shruti
tammu - shruti

టాలీవుడ్ ఇండస్ట్రీలో తెల్లపిల్లగా పేరుగాంచిన హీరోయిన్ తమన్నా. ఈ మిల్కీ బ్యూటీ గురించి విశ్వనటుడు కమల్ హాసన్ కుమార్తె, హీరోయిన్ శృతిహాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తానేగనుక మగాడిని అయివుంటే.. ఖచ్చితంగా తమన్నాతో డేటింగ్‌కు వెళ్లివుండేవాడినని చెప్పుకొచ్చింది.

నిజానికి ఏ సినీ ఇండస్ట్రీని తీసుకున్నా హీరోయిన్స్‌కి ఒకరంటే ఒకరికి అస్సలు పడదు. ఇది వాస్తవం కూడా. కానీ మిల్కీబ్యూటీ తమన్నా, శ్రుతిహాసన్ స్నేహం అలా కాదు. ఇద్దరూ చాలా మంచి స్నేహితులు. అవకాశం దొరికితే చాలు ఒకరినొకరు ప్రశంసలతో ముంచెత్తుకుంటూ ఉంటారు. తమన్నా చాలా మంచి అమ్మాయని.. తనను అంత తేలికగా వదులుకోనని అంటోంది శ్రుతిహాసన్.

ఓ కార్యక్రమంలో శ్రుతిని.. ‘ఒకవేళ మీరు అబ్బాయి అయి ఉంటే ఏ హీరోయిన్‌తో డేట్‌కు వెళ్లేవారు?’ అన్న ప్రశ్న అడిగారు. దీనికి తడుముకోకుండా.. ‘ఇంకెవరు? తమన్నా’ అంటూ ఠక్కున బదులిచ్చింది. అంతేకాదు.. ఇంకా శ్రుతి మాట్లాడుతూ.. ‘నేనే గనక అబ్బాయిని అయివుంటే.. తమన్నాను డేటింగ్‌కు తీసుకెళ్లేదాన్ని. అంతేకాదు పెళ్లి కూడా చేసుకునేదాన్ని. తమన్నా చాలా మంచి అమ్మాయి. తనను అంత తేలిగ్గా వదులుకోను’ అని చెప్పుకొచ్చింది.