వేసవి తాపం నుంచి రక్షించే కాయల్లో పుచ్చకాయ ఒకటి. వేసవిలో పుచ్చకాయలు విరివిగా లభిస్తాయి. ఈ కాయను ప్రతిరోజూ ఆరగించడం వల్ల వడదెబ్బ నుంచి రక్షణ పొందవచ్చు. అలాంటి పుచ్చకాయతో మిల్క్ షేక్ కూడా తయారు చేసుకోవచ్చు. అది ఎలా తయారు చేసుకోవచ్చో ఇపుడు తెలుసుకుందాం.
మిల్క్ షేక్‌కు కావాల్సిన పదార్థాలు…
తాజా పుచ్చకాయ ముక్కలు – మూడు కప్పులు
పుదీనా ఆకులు – పావుకప్పు
తాగే సోడా – అరకప్పు
వెనిల్లా ఐస్‌క్రీం – నాలుగు పెద్ద చెంచాలు.
తయారీ విధానం..
తొలుత పుచ్చకాయ ముక్కలు, సన్నగా తరిగిన పుదీనా ఆకులు మిక్సీలోకి తీసుకుని కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ రసంలా చేసుకోవాలి. ముందుగా గ్లాసుల్లోకి వెనిల్లా ఐస్‌క్రీం తీసుకుని తర్వాత వడకట్టిన పుచ్చకాయ రసం వేయాలి. చివరగా కొద్దిగా తాగే సోడా వేసుకుని పైన రెండు పుదీనా ఆకులు అలంకరిస్తే చాలు.