అరుదైన మహిళ : 9 నిమిషాల్లో ఆరుగురు బిడ్డలకు జన్మ

US woman gives birth to 6 babies in 9 minutes

0
65
us woman
us woman

అమెరికాకు చెందిన ఓ మహిళ అరుదైన ఘనత సాధించింది. కేవలం 9 నిమిషాల్లో ఆరుగురు బిడ్డలకు జన్మనిచ్చింది. కేవలం 470 కోట్ల మంది మహిళల్లో ఒక్కరు మాత్రమే ఇలా జన్మనిస్తారని వైద్యులు చెబుతున్నారు.

తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, యూఎస్‌లోని టెక్సాస్‌లో ఉన్న మహిళల ప్రసూతి ఆస్పత్రిలో ఆ మహిళ ప్రసవం కోసం చేరింది. ఈ మహిళకు కొందరు వైద్యులు దగ్గరుండి కాన్పు చేశారు. ఈమె ఏకంగా ఆరుగురు పిల్లలకు జన్మనిచ్చింది. వీరిలో నలుగురు బాబులు, ఇద్దరు పాపలు ఉన్నారు. ఈ డెలివరీని సెక్స్‌టప్లెట్స్ అని అంటారట. సెక్స్‌టప్లెట్ అంటే ఒకే డెలివరీలో ఆరుగురు పిల్లలకు జన్మనివ్వడం.

ముందుగా ఇద్దరు మగ పిల్లలు, ఆ తర్వాత మరో ఇద్దరు మగ పిల్లలు, ఆ తర్వాత ఇద్దరు ఆడబిడ్డలకు ఆ మహిళ జన్మనిచ్చిందట. ప్రస్తుతం ఆరుగురు పిల్లలు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఉదయం 4.50 నుంచి 4.59 వరకు కేవలం 9 నిమిషాల్లో ఆరుగురు బిడ్డలకు ఆమె జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లి తెల్మా చియాక ఆరోగ్యం కూడా బాగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

పిల్లలంతా.. 790 గ్రాముల నుంచి 1.3 కిలోల బరువుతో జన్మించారట. వాళ్లను ప్రస్తుతం ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉంచి అబ్సర్వేషన్‌లో పెట్టారు. పిల్లలు పుట్టిన కొద్ది సేపటికే తెల్మా.. తన బిడ్డలకు జినా, జురియెల్‌గా నామకరణం చేసింది. తన నలుగురు కొడుకులకు మాత్రం ఏం పేరు పెట్టాలా అని బెడ్ మీదే ఆలోచిస్తోంది.