వివాదాస్పదమైన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం విడుదలకు సెన్సార్ బోర్డు అభ్యంతరం చెప్పింది. ఎన్నికల సంఘం ఆదేశాల నేపథ్యంలో ఈ సినిమా విడుదలపై నిర్ణయం తీసుకున్నట్టు సెన్సార్ బోర్డు వర్గాలు తెలిపాయి.
లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం ఎన్నికల సమయంలో రిలీజైతే టీడీపీకి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందంటూ దేవీబాబు అనే టీడీపీ కార్యకర్త ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో.. ఎన్నికల సంఘం సెన్సార్ బోర్డుకు పలు సూచనలు చేసింది.
అంతేగాకుండా లక్ష్మీస్ ఎన్టీఆఱ్ సినీ బృందానికి ఈ మేరకు సెన్సార్ బోర్డు నుంచి ఆదేశాలు వెళ్లాయి. ఎన్నికలు పూర్తయ్యాక సినిమాను విడుదల చేసుకోవచ్చంటూ సెన్సార్ వర్గాలు సూచించాయి. దీనిపై స్పందించిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ న్యాయపోరాటం చేస్తానంటూ ట్వీట్ చేశారు.