ఉద్యోగం, డబ్బు కోసం ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య…

Wife killed his husband with help of lover for Job and Money

0
71
Murder
Murder

ఇటీవలికాలంలో వివాహేతర సంబంధాల కారణంగా జరిగే హత్యల సంఖ్య పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ ధోరణి ఎక్కువగా కనిపిస్తోంది. తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్‌లో ఉద్యోగం, డబ్బు కోసం తన ప్రియుడుతో కలిసి భర్తను భార్య హత్య చేసింది.

ఈ వివరాలను పరిశీలిస్తే, మహబూబ్‌నగర్‌ మునిసిపల్‌ స్వీపర్‌ నర్సింహ(35) భార్య లక్ష్మీదేవికి కొంతకాలంగా పూసల శేఖర్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీంతో ఆమె శేఖర్‌తో దేవరకొండకు వెళ్లిపోయి ఏడాదిపాటు సహజీవనం చేస్తోంది. ఇటీవల తిరిగి భర్త వద్దకు తిరిగి వచ్చింది.

దీనికి కారణం.. భర్త నర్సింహను అడ్డు తొలిగించుకోవడంతో పాటు ఉద్యోగం, ప్లాటును పొందాలని పథకం వేసింది. ఈ విషయాన్ని ప్రియుడికి చెప్పింది. తమ పథకంలో భాగంగా, ఈనెల 3వ తేదీన శేఖర్‌.. నర్సింహను జడ్చర్ల మండలం బురెడ్డిపల్లి శివారుకు తీసుకు రాగా, మద్యం సేవించిన అనంతం శేఖర్‌, లక్ష్మీదేవిలు కలిసి తలపై బీరు సీసాతో కొట్టి చంపేశారు. ఆ తర్వాత ఏమీ తెలియనట్టుగా ఇంటికెళ్లారు.

రెండు మూడు రోజుల తర్వాత తన భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. లక్ష్మీదేవి గురించి ఆ ఊరిలో ఆరా తీయగా అసలు విషయం వెల్లడైంది. ఆ తర్వాత ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు విషయం బయటపడింది. దీంతో ఆమెతో పాటు ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు.