సైనికుల సంక్షేమ నిధి బీసీసీఐ భారీ విరాళం

BCCI set to contribute Rs 20 crore for welfare of armed forces

0
69
bcci logo
bcci logo

ఇటీవల పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ముందుకు వచ్చింది. ఇందుకోసం భారీ మొత్తంలో విరాళాన్ని ప్రకటించింది. ఫలితంగా సైనికుల సంక్షేమ నిధికి బీసీసీఐ ఏకంగా, రూ.20 కోట్ల విరాళాన్ని ప్రకటించింది.

ఈనెల 23న జరిగే ఐపీఎల్-12 ప్రారంభోత్సవానికి త్రివిధ (ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నేవీ) దళాలలోని అత్యున్నత స్థాయి అధికారులను ఆహ్వానించి.. వారికి ఈ విరాళాన్ని అందజేయాలని భావిస్తోంది. సైనిక సంక్షేమ నిధికి రూ.20 కోట్లు ఇచ్చేందుకు సీవోఏ అనుమతించింది.

ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌తో బెంగళూరు రాయల్స్ చాలెంజర్స్ తలపడనుంది. కాబట్టి విరాళం అందజేసే కార్యక్రమంలో ధోనీ, విరాట్ కూడా పాల్గొంటారు అని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో ఈసారి ఐపీఎల్ ప్రారంభోత్సవాన్ని రద్దు చేసి దానికయ్యే ఖర్చును సైన్యానికి ఇవ్వాలని గతంలో బీసీసీఐ నిర్ణయించిన విషయం తెల్సిందే.

గతేడాది ఐపీఎల్ ప్రారంభోత్సవ బడ్జెట్ సుమారు రూ.15 కోట్లు. దానికి మరో రూ.5 కోట్లు కలిపి ఇవ్వాలని బీసీసీఐ ప్రతిపాదించింది. ఈ మొత్తాన్ని సైనిక సంక్షేమ నిధితో పాటు జాతీయ రక్షణ నిధికి అందజేస్తాం అని సదరు అధికారి వెల్లడించారు.