నిమ్మకాయల్లో శరీరానికి ఉపయోగపడే ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలు దాగి ఉంటాయి. నిమ్మరసంలో ఉండే విటమిన్ “సి” శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
వేసవిలో నిమ్మరసం తాగితే ఎండ దెబ్బ బారిన పడకుండా ఉండవచ్చు. అయితే నిమ్మరసాన్ని ఎప్పుడో ఒకసారి కాకుండా రోజూ వాడితే మనకు ఇంకా ఎన్నో లాభాలు కలుగుతాయి.
నిత్యం పరగడుపునే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒక టీస్పూన్ నిమ్మరసం కలిపి తాగితే దాంతో అనేక ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
* అధిక బరువు తగ్గాలనుకునే వారు నిమ్మరసం, వేడి నీటి మిశ్రమం రోజూ తాగితే ఫలితం ఉంటుంది.
* నిమ్మరసం, వేడి నీటి మిశ్రమం తాగడం వల్ల మన శరీరంలో ఉండే వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. చర్మ సమస్యలు తగ్గుతాయి. జీర్ణ సమస్యలు ఉండవు.
* దగ్గు, జలుబు, జ్వరం ఉన్నవారు రోజూ పరగడుపునే గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగితే ఆయా సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
* కిడ్నీ స్టోన్లు ఉన్నవారు వేడి నీరు, నిమ్మరసం మిశ్రమం తాగుతుంటే కిడ్నీ స్టోన్లు త్వరగా కరిగిపోతాయి.
* వేడి నీరు, నిమ్మరసం మిశ్రమం తాగితే డయాబెటిస్ అదుపులో ఉంటుంది.