ఆత్మహత్యకు ప్రయత్నించలేదు.. అన్నీ అబద్ధాలే.. : పారిస్ జాక్సన్

Paris Jackson Resurfaces After Denying Attempted Suicide Report

0
44
Paris Jackson
Paris Jackson

దివంగత పాప్‌స్టార్‌ మైఖెల్‌ జాక్సన్‌ కుమార్తె పారిస్‌ జాక్సన్‌. ఈమె ఇటీవల ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు వార్లు వచ్చాయి. ముఖ్యంగా, శనివారం రాత్రి 7 గంటల ప్రాంతంలో పారిస్‌ తన నివాసంలో చేయి కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారని, సకాంలో ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాలతో బయటపడ్డారని పలు ఆంగ్ల మీడియా వర్గాలు పేర్కొన్నాయి.

ఈ వార్తలపై ఆమె క్లారిటీ ఇచ్చారు. అవన్నీ అబద్ధాలేనంటూ మీడియాపై విరుచుకుపడ్డారు. మైఖెల్‌ జాక్సన్‌పై ‘లీవింగ్‌ నెవర్‌ల్యాండ్‌’ అనే డాక్యుమెంటరీ విడుదల కావడంపై పారిస్‌ చాలా బాధపడ్డారని, అందుకే కోపంలో చేయి కోసుకున్నారని వార్తలు వచ్చాయి.

ఈ డాక్యుమెంటరీలో మైఖెల్‌ ఇద్దరు యువకులను లైంగికంగా వేధించినట్లు చూపించారు. అది చూసి పారిస్‌ ఉద్వేగానికి లోనై ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారని హాలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి. కానీ వాటిలో ఎంతమాత్రం నిజంలేదని పారిస్‌ స్పష్టంచేశారు.