ఏడిస్తే కళ్ళు ఎందుకు ఎరుపెక్కుతాయి..?

0
40

ఏదైనా ఒక విష‌యం గురించి తెలుసుకోవాల‌న్న కుతూహ‌త‌లం ప్ర‌తి ఒక్క‌రికీ ఉంటుంది. అయితే చిన్న పిల్ల‌ల్లో అది ఎక్కువ‌గా ఉంటుంది. సాధార‌ణంగా మ‌న‌కి ఆనందం వ‌చ్చిన‌, బాధ క‌లిగినా ఏడుస్తాం. ఎలాంటి సంద‌ర్భం అయినా ఏడిస్తే క‌ళ్ళు ఎరుపెక్కుతాయి. కుదుళ్ళ నుండి నిత్యం కన్నీరు స్రవిస్తూనే ఉంటుది. సాధారణ ప‌రిస్థితుల్లో ఈ క‌న్నీరు ప‌రిమితంగా స్ర‌విస్తుంది. మరి ఏడవడం అంటే ఒక మానసికపరమైన (emotional) అనియంత్రితమైన (involuntary) దైహిక స్పందన. గుండె వేగముగా కొట్టుకోవడము, రక్తప్రసరణ వేగముగా ఉండడము, ఉద్వేగానికి గురికావడం, ఇతర ఆలోచనలు, తార్కిక దృష్టి లోపించడము ఏడుపు సమయములో సంభవిస్తాయి. అలాగే గొంతు గాద్గదికం కావడము, ముక్కు కారడ, మాటలు తడబడడము జరుగుతాయి. ఏడ్చేట‌ప్పుడు కళ్ళలో లాక్రిమల్ గ్రంధులు ఎక్కువగా నీటిని స్రవించడానికి వాటిలోనూ, కంటి పొరలలోను ఎక్కువ రక్తము సరఫరా అవడానికి రక్తకేశనాళికలు (blood capillaries) ఉబ్బుతాయి. అలా ఉబ్బినవి పారదర్శకముగా ఉండే తెల్లగుడ్డు కింద నుంచి కనిపించడం వలనే కళ్ళలో ఎరుపు, ఎర్రటి జీరలు కనిపిస్తాయి.