ఏ కులం వాడు కూడా ఇన్‌క్లూడింగ్ ‘కమ్మ’.. చంద్రబాబు అనే వాడికి ఓటు వేయొద్దు.. పోసాని

0
53
Posani Krishna Murali
Posani Krishna Murali

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై సినీ నటుడు పోసాని కృష్ణమురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అన్ని కులాలకు, మతాలకు ఒక్క మాట చెబుతున్నాను. ఏ కులం వాడు కూడా ఇన్ క్లూడింగ్ ‘కమ్మ’.. చంద్రబాబు అనే వాడికి ఓటు వేయొద్దు. అతనొక పెద్ద దొంగ.. అబద్ధాల మనిషి.. అవినీతిపరుడు.

ఇంత కూడా విలువలు లేకుండా బతుకుతున్న మనిషి. చంద్రబాబుకు ఎవరైనా ఓటు వేస్తే, అది కమ్మ రాజ్యానికి, కమ్మ కులానికి, కమ్మ దేశానికి మాత్రమే ఓటేసినట్టే. మరొక్కసారి చంద్రబాబుకు మీరు ఓటేసి గెలిపించారంటే, ఆంధ్ర రాష్ట్రం కమ్మ రాష్ట్రం అయిపోతుంది. ఆంధ్ర దేశం నాశనమైపోతుంది’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అంతేకాకుండా, ‘ఈ సందర్భంగా మీడియా ద్వారా ప్రజలకు చెప్పదలచుకున్నాను. ఎవడు దొంగో..‘దొంగ’ అనే చెప్పండి. ఎవడు లుచ్ఛానో ‘లుచ్ఛా’ అనే చెప్పండి. ఎవడు మంచోడో..‘మంచోడు’ అనే చెప్పండి అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా గతంలో పీఆర్పీ తరపున పోసాని ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పటి సంఘటనను ప్రస్తావించారు. చంద్రబాబు ఏ కులాన్ని తిట్టకుండా వదిలిపెట్టలేదని ఆరోపించారు. ఆరోజున చిరంజీవి కుటుంబంలోని ఆడవాళ్లను కూడా చంద్రబాబు తన పార్టీ వాళ్లతో తిట్టించారని ఆరోపించారు.

గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ వల్లే గెలిచిన చంద్రబాబు, ఈరోజున ఆయన్ని కూడా తిడుతున్నారని విమర్శించారు. ‘’ఇది మంచి..ఇది చెడు’ అని చెబుతున్న పవన్ కల్యాణ్ ని అమ్మలక్కలతో తిట్టిస్తావా? అంటూ నిలదీశారు. మొన్నటి దాకా మోడీ కాళ్లు పట్టుకుని, ఆయనకు శాలువా కప్పిన చంద్రబాబు, ఇప్పుడు, అదే మోడీని హీనంగా తిడుతున్నారని ఎద్దేవా చేశారు.