తమిళ హీరో ఆర్యను పెళ్లి చేసుకున్న హీరోయిన్ సాయేష్. వీరిద్దరి వివాహం ఇటీవలే జరిగింది. ఈ వివాహం తర్వాత సాయేష్ సినీ కెరీర్‌కు గుడ్‌బై చెబుతుందన్న ప్రచారం జోరుగా సాగింది. దీనిపై ఆమె తాజాగా స్పష్టత ఇచ్చింది.
సినిమాల్లో నటించడం కొనసాగిస్తానని, ఈ విషయంలో తనకు పూర్తి స్వేచ్ఛ ఉందని అన్నారు. ‘నటించాలా?వద్దా?.. అనేది నా ఇష్టం. మునుపటిలాగే సినిమాలకు సంతకం చేస్తా. ఆర్య నాకు పూర్తి సపోర్ట్ ఇచ్చాడు. పెళ్లి తర్వాత కూడా నటిస్తూ అద్భుతంగా రాణిస్తున్న కథానాయికలు జ్యోతిక, సమంత నాకు స్ఫూర్తి’ అని చెప్పుకొచ్చింది.
అఖిల్ సినిమాతో సాయేషా నటిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఇందులో ఆమె నటనకు మంచి స్పందన లభించింది. తర్వాత కోలీవుడ్‌లో బిజీ అయ్యారు. ‘గజినీకాంత్’ (2018) సినిమా కోసం ఆర్య, సాయేషా తొలిసారి కలిసి పనిచేశారు.
సంతోష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం షూటింగ్లో ఇద్దరు స్నేహితులయ్యారు. తర్వాత అది ప్రేమగా మారింది. కొన్ని రోజుల క్రితం వీరి వివాహ వేడుక కుటుంబ సభ్యుల సమక్షంలో హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ప్రస్తుతం సాయేషా, ఆర్య కలిసి ‘కాప్పన్’ చిత్రంలో నటిస్తున్నారు.