మొహం పగలగొడతా… చైతుకు సమంత వార్నింగ్

0
104
sam - chai
sam - chai

తన భర్త అక్కినేని నాగచైతన్యకు భార్య సమంత గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. అమ్మాయిల వైపు కన్నెత్తి చూస్తే ముఖం పచ్చడి చేస్తానంటూ హెచ్చరించింది.

టాలీవుడ్‌లో హీరోహీరోయిన్లుగా ఉన్న చై అండ్ సామ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెల్సిందే. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న చిత్రం ‘మజిలీ’ ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది.

కాగా, శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమాను, వచ్చేనెల 5వ తేదీన విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సమంత మాట్లాడుతూ,

“చైతూ గురించి నాకంటే ఎక్కువగా ఎవరికీ తెలియదు .. అలాగే నా గురించి చైతూ కంటే ఎక్కువగా ఎవరికీ తెలియదు. అలా మా ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది” అని సమంత అంది.

ఇక తనకెదురైన ప్రశ్నకి చైతూ సమాధానమిస్తూ .. ‘ఎవరికైనా పెళ్లి అయిన ఏడాది వరకే హ్యాపీగా వుంటుంది .. ఆ తరువాత అంతా బోరింగే’ అంటూ సమంతను ఉడికించాడు. మరో ప్రశ్నకి సరదా సమాధానంగా ఆయన ‘నాకు కార్లన్నా.. అమ్మాయిలన్నా చాలా ఇష్టం’ అనడంతో, ‘అలా అంటే ముఖంపై పంచ్ ఇస్తాను’ అంటూ సమంత కొంటె కోపాన్ని ప్రదర్శించింది.