ప్రతి రోజూ అల్లం టీ తాగితే…

0
49
ginger tea
ginger tea

అల్లాన్ని ప్రతి రోజూ కూరల తయారీలో వాడుతుంటారు. ఫలితంగా కూరలకు చక్కని రుచి వస్తుంది. కేవలం రుచికే కాదు, ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందివ్వ‌డంలోనూ అల్లం ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈ క్ర‌మంలోనే అల్లంతో టీ త‌యారు చేసుకుని నిత్యం తాగితే ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

* బాగా త‌ల‌నొప్పిగా ఉంటే అల్లం టీ తాగితే వెంట‌నే నొప్పి త‌గ్గిపోతుంది.

* అల్లం టీని రోజూ తాగితే ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. హైబీపీ త‌గ్గుతుంది.

* కీళ్ల నొప్పులు ఉన్న‌వారు అల్లం టీ తాగితే ఆ నొప్పుల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

* తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణం కాకుండా స‌మ‌స్య‌లు ఎదుర్కొనేవారు అల్లం టీని తాగితే ఆ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

* రుతుక్ర‌మం స‌రిగ్గా ఉండ‌ని మ‌హిళ‌లు అల్లం టీ తాగితే ఉత్త‌మం. అలాగే శ‌రీర రోగ నిరోధ శ‌క్తి కూడా అల్లం టీతో పెరుగుతుంది.

* అల్లం టీని నిత్యం తాగుతుంటే అధిక బ‌రువు, కొలెస్ట్రాల్ స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి.

* అల్లం టీని తాగి ప్ర‌యాణాలు చేస్తే వాంతులు రాకుండా ఉంటాయి. కొంద‌రికి కార్లు, బ‌స్సుల్లో ప్ర‌యాణాలు చేసేట‌ప్పుడు వాంతులు అవుతుంటాయి. అలాంటి వారు ప్ర‌యాణానికి ముందు అల్లం టీ తాగితే ఫ‌లితం ఉంటుంది.