వేసవిలో మల్లెల ఛాయ్ తాగితే..? చెడు కొలెస్ట్రాల్ పరార్

0
39

వేసవి, మల్లెల ఛాయ్, కొలెస్ట్రాల్ వేసవిలో వచ్చే మల్లెలను అలంకరించుకోవడం కోసమే కాదు.. ఆరోగ్యానికి కోసమూ ఉపయోగించవచ్చు అంటున్నారు.. ఆయుర్వేద నిపుణులు. ఘాటైన సువాసనతో మనసుని ఆహ్లాదపరిచే మల్లెలతో టీ తయారు చేసి సేవించడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. నాణ్యమైన మల్లెలు మొగ్గదశలో ఉన్నప్పుడు మొదటి పూలను సేకరిస్తారు. వాటిని ప్రత్యేక పద్ధతుల్లో ఎండబెట్టి టీకోసం సిద్ధం చేస్తారు.

అలా తయారు చేసిన టీ సాచెట్లను వేణ్ణీళ్లల్లో వేస్తే చాలు. మల్లెల టీ సిద్ధమైనట్లే. దీనికి కాస్త తేనె కలిపితే రుచితో పాటు ఆరోగ్యం కూడా మీ సొంతం అవుతుంది. అలా కాకుండా తాజా మల్లెలను తీసుకుని నీటిలో మరిగించి ఆ నీటికి తేనె కలుపుకుని రోజుకో కప్పు తీసుకుంటే శరీరంలోని చెడుకొలెస్ట్రాల్ ఇట్టే కరిగిస్తుంది. ఇందులోని కాచెన్స్‌ అనే గుణం వల్ల జీవక్రియల వేగం పెరుగుతుంది. తద్వారా చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది.

మల్లెల టీ రోజూ తాగేవారి చర్మం తాజాగా కనిపిస్తుందట. మల్లెల టీలో వ్యాధినిరోధక శక్తిని పెంచే సుగుణాలూ ఎక్కువగా వున్నాయి. ఇది అధిక రక్తపోటుని అదుపులో ఉంచుతుంది. ఫలితంగా గుండెపోటు, బ్రెయిన్‌ స్ట్రోక్‌లు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. నిద్రలేమితో బాధపడేవారికి ఇది మంచి మందు. జలుబు చేసినప్పుడు, జ్వరంతో బాధపడుతున్నప్పుడు తాగితే వాటిల్లోని యాంటీవైరల్‌, యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు ఆ బాధల నుంచి ఉపశమనం కలిగిస్తాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.