కష్టకాలంలో నా వెన్నంటి ఉన్నారు… జైలుకెళ్లకుండా చేశారు : అనిల్ అంబానీ

Anil Ambani thanks elder brother Mukesh Ambani for paying Ericsson dues

0
57
anil ambani
anil ambani

రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఆర్ కామ్ సంస్థకు చెందిన రూ.462 కోట్ల బకాయిలను సకాలంలో చెల్లించడంతో పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ ఊపిరి పీల్చుకున్నారు. ఈ సందర్భంగా తన అన్నావదినలు ముఖేష్ అంబానీ, నీతా అంబానీలకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు.

“మా పెద్దన్నయ్య ముఖేష్, మా వదిన నీతాలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. కష్టకాలంలో నా వెన్నంటి ఉన్నారు. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలకు నిదర్శనంగా నిలిచారు. నేను నా కుటుంబం ఇకమీదట కూడా ఇలాగే కొనసాగుతాం. ముఖేష్, నీతా చేసిన సాయం హృదయాన్ని తాకింది” అంటూ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

కాగా, స్వీడన్‌కు చెందిన ఎరిక్సన్ కంపెనీకి పాత బకాయిల కింద రూ.571 కోట్లు చెల్లించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించడంతో అప్పటికే నష్టాలతో సతమతమవుతున్న అనిల్ ఉక్కిరిబిక్కిరయ్యారు. మార్చి 19లోపు చెల్లించకపోతే మూడు నెలల జైలుశిక్ష ఎదుర్కోవాల్సి ఉంటుందని సుప్రీం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో, గడువుకు ఒకరోజు ముందే మార్చి 18న బకాయిలు చెల్లించి పరువు కాపాడుకున్నారు.