కోడిగుడ్డు తినడం లేదా.. అయితే చక్కెర వ్యాధి ఖాయం

0
41
egg
egg

శ‌రీరానికి సంపూర్ణ పోష‌ణ అందాలంటే రోజుకో గుడ్డును తినాల‌ని వైద్యులు సలహా ఇస్తుంటారు. అయితే రోజుకో గుడ్డును తిన‌డం వ‌ల్ల పోష‌ణ అంద‌డం మాత్ర‌మే కాదు, మధుమేహం వ్యాధి వచ్చే అవకాశాలు చాలా తక్కువుగా ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు.

* నిత్యం ఒక కోడిగుడ్డును తిన‌డం వ‌ల్ల డ‌యాబెటిస్ వ్యాధి రాకుండా చూసుకోవ‌చ్చ‌ని సైంటిస్టుల అభిప్రాయంగా ఉంది.
* ఇందుకోసం 230 మంది వ్య‌క్తుల‌ను 20 ఏళ్ల పాటు శాస్త్రవేత్తలు పరిశీలించారు.
* ఈ పరిశోధనలో రోజుకో గుడ్డు తినేవారిలో డయాబెటిస్ వ‌చ్చే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉన్నట్టు కనుగొన్నారు.
* అదేసమయంలో గుడ్డు తిన‌ని వారికి డ‌యాబెటిస్ వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నట్టు గుర్తించారు.
* గుడ్డులో ఉండే జీవ ర‌సాయ‌న స‌మ్మేళ‌నాలు డ‌యాబెటిస్ రాకుండా చూస్తాయ‌ని సైంటిస్టులు చెబుతున్నారు.
* అందుకే ప్రతి ఒక్కరూ రోజుకో గుడ్డును తినాల‌ని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ అధ్య‌య‌న వివ‌రాల‌ను మాలిక్యులార్ న్యూట్రిష‌న్ అండ్ ఫుడ్ రీసెర్చి అనే జ‌ర్న‌ల్‌లో ప్ర‌చురించారు.