నీలాంబరి పాత్రలో నటించేటపుడు ఇబ్బందిపడ్డా : రమ్యకృష్ణ

0
68
ramyakrishnan
ramyakrishnan

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ. ఒకపుడు తిరుగులేని నటిగా చెలామణి అయింది. ఈమెకు వయసు మీదపడుతున్నా… అందం మాత్రం ఏమాత్రం చెక్కుచెదరలేదు. కుర్ర హీరోయిన్లతో పోటీపడుతూ అవకాశాలు దక్కించుకుంటుంది.

అంతేనా, దాదాపు నిన్నటి తరం తెలుగు హీరోలు అందరితోటి నటించింది. మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకొని ఇప్పుడు తనవంతుగా సహాయ పాత్రలు చేస్తూ వస్తుంది. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో బిగ్ బ్లాక్ బస్టర్ సినిమా ‘బాహుబలి’ శివగామిగా తన నటనతో ఆ పాత్రకు ప్రాణం పోసింది.

ఇలాంటి పాత్రలు ఆమె కెరీర్‌లో చాలానే ఉన్నాయి. అందులో ఒకటి రజినీకాంత్ హీరోగా వచ్చిన ‘నరసింహ’ సినిమాలోని నీలాంబరి పాత్ర. తాజా ఇంటర్వ్యూలో రమ్యకృష్ణ ఈ పాత్రను గురించి మాట్లాడుతూ నిజం చెప్పాలంటే ఆ పాత్రపట్ల నాకు ఆసక్తి వుండేది కాదు. నెగెటివ్ షేడ్స్ కలిగిన ఆ పాత్రను చేయడానికి నేను చాలా భయపడినట్టు చెప్పారు.

ముఖ్యంగా, ‘నీలాంబరి’ పాత్ర మనస్తత్వం నన్ను కూడా చాలా కలవరపాటుకు గురిచేసింది. సౌందర్య ముఖాన్ని కాలుతో తాకుతూ నాలోని పొగరుని చూపించే సీన్ చేయడానికి నేను చాలా ఇబ్బందిపడ్డాను. అలాగే మరికొన్ని సన్నివేశాల్లో నటించేటప్పుడు కూడా అదే పరిస్థితి ఎదురైంది. అయితే, ‘నీలాంబరి’ పాత్ర ఇంతటి పేరును తీసుకొస్తుందని అప్పట్లో నేను ఎంతమాత్రం ఊహించలేదు అని ఆమె చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం రమ్యకృష్ణ టాలీవుడ్ మన్మథుడు నటించే బంగార్రాజు చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుండగా, ‘సూపర్ డీలక్స్’లో వేశ్యగా రమ్యకృష్ణ కనిపించనుంది. ఈ సినిమా మరి కొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకురానుంది. బంగార్రాజు మాత్రం వచ్చే యేడాది వేసవికి విడుదల కానుంది.