బొప్పాయి ఫేస్‌ ప్యాక్‌ ఎలా?

Papaya Face Packs For Glowing, Fair, And Smooth Skin

0
101

బొప్పాయి పండు ఆరోగ్యానికి ఎంతో మంచిది. చర్మ సౌందర్యాన్ని సైతం ఇది కాపాడుతుంది. ముఖ్యంగా, బొప్పాయితో ఫేస్‌ ప్యాక్ చేసుకోవచ్చు. అదెలా వేసుకోవచ్చో తెలుసుకుందాం.

తొలుత మొదట బొప్పాయి పండుని బాగా గుజ్జులా చేసుకోవాలి. ఆ గుజ్జులో గుడ్డులోని తెల్లసొన, తేనె, పెరుగు, నిమ్మరసం వేసి ఆ మిశ్రమాన్ని చిక్కగా అయ్యేంత వరకూ కలపాలి.

ముఖం చల్లటి నీళ్లతో బాగా కడుక్కుని ఈ పేస్టును ముఖానికి పూసుకొని 20 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల ముఖానికున్న మురికిపోయి ముఖం మెరుస్తుంది.

చర్మం మీద మచ్చలు, మొటిమలు పోవాలంటే బొప్పాయి ఫేస్‌ ప్యాక్‌ బాగా పనిచేస్తుది. చర్మానికి కావాలసిన నీరు బొప్పాయిలో పుష్కలంగా ఉంటుంది. ఇలా బొప్పాయి గుజ్జుతో వేసుకునే ఫేస్ ప్యాక్ చర్మ రక్షణ ఎంతగానో దోహదపడుతుంది.