వేసవిలో వ్యాయామం ఎలా?

Tips For Exercising In Summer Heat

0
37
Exercise
Exercise

ఎండలు మండుతున్నప్పుడు వ్యాయామం చేయకపోవడమే మంచిదనుకుంటారు చాలామంది. కొందరు చేసే సమయాన్ని, వ్యాయామాలని తగ్గిస్తే… మరికొందరు తాత్కాలికంగా విరామం ఇచ్చేస్తారు. కానీ వ్యాయామానికి, కాలానికి ఎలాంటి సంబంధం లేదు. ఆరుబయట చేయడం కష్టం అనుకుంటే… ఇంట్లోనే వ్యాయామాలు చేయండి. జిమ్‌లో చేరొచ్చు. లేదా యూట్యూబ్‌ సాయంతో రకరకాల వ్యాయామాలు చేయొచ్చు.

* ఈత కూడా వ్యాయామంలో భాగం కాబట్టి… వేసవిలో దాన్ని ఎంచుకోవచ్చు. కనీసం పదినిమిషాలతో మొదలుపెట్టి అరగంట చేసినా చాలు. దాదాపు 400 కెలొరీల వరకూ కరుగుతాయి. శరీరం మొత్తానికి వ్యాయామం అందినట్లు అవుతుంది.

* ఎక్కువ సమయం చేయలేనని అనుకుంటే కార్డియో వ్యాయామాలు చేయొచ్చు. నడక, పరుగు, స్క్వాట్స్‌, పుషప్స్‌, జంపింగ్‌… లాంటివి అందులో కొన్ని.

* వ్యాయామం చేస్తున్నప్పుడు అతినీలలోహిత కిరణాల ప్రభావం చర్మంపై పడకుండా ఉండాలంటే ఆహారంలో ఆలివ్‌నూనె ఉండేలా చూసుకోవాలి. దీనిలోని మేలుచేసే కొవ్వులు చర్మాన్ని కాపాడతాయి.

* వ్యాయామం చేస్తున్నప్పుడు దాహం వేసే వరకూ ఆగకూడదు. నీటిశాతం తగ్గితే నీరసం వచ్చేస్తుంది. దాంతో వ్యాయామం చేయలేని పరిస్థితి. కాబట్టి వెంట ఓ నీళ్ల సీసా పెట్టుకుని అప్పుడప్పుడూ తాగుతూ ఉండాలి.

* వ్యాయామానికి ముందు కనీసం రెండుగ్లాసుల నీళ్లు తాగాలి. వ్యాయామం అయ్యాక కూడా ఎక్కువగా తాగాలి.