వేసవిలో శరీరానికి చల్లదనాన్నిచ్చే పండ్లేవి?

0
46
watermelon
watermelon

వేసవి కాలంలో ఆహారం కంటే.. శరీరాన్ని చల్లబరిచే పండ్లు, శీతలపానీయాలనే ఎక్కువగా ఇష్టపడతారు. ముఖ్యంగా, కొబ్బరి నీళ్లు, పుచ్చకాయలు, కిరిణీ కాయలు వంటివి ఎక్కువగా ఆరగిస్తుంటారు. ఇది ఒక విధంగా ఆరోగ్యానికి ఎంతో మంచిది కూడా. పండ్లు కడుపును చల్లగా ఉంచడం మాత్రమే కాక, వేసవి తాపం నుంచి ఉపశమనం పొందవచ్చు.

అలాంటి వేసవి కాలంలో ఎక్కువగా పుచ్చకాయలతో పాటు.. మామిడి పండ్లు, బత్తాయి పండ్లను ఎక్కువగా ఆరగించాలి. ఈ పండ్లలో ఉండే చక్కెరశాతం కూడా ఇంచుమించు ఒకే మోతాదులో ఉంటుంది. మిగిలిన పదార్థాల కన్నా చక్కెర శాతం ఎక్కువగా ఉంటే అవి తియ్యగా ఉంటాయి.

ఆమ్ల గుణాలున్న పదార్థాలు సిట్రిక్‌ ఆమ్లం, లాక్టిక్‌ ఆమ్లం, ఆస్కార్బిక్‌ ఆమ్లం ఎక్కువగా ఉంటే ఆ పండ్లు పుల్లగా ఉంటాయి. ఆల్కలాయిడ్లు, క్షార లక్షణాలు అధికంగా ఉండే పండ్లు వగరుగా అనిపిస్తాయి. ఆయా పండ్లలో రసాయనిక సంఘటన మీదనే రుచి, వాసన, రంగు, హారపు విలువలు అనేవి ఆధారపడి ఉంటాయి. ఇవి వేసవి కాలంలో వేసవి తాపాన్ని తగ్గించి శరీరాన్ని చల్లబరుస్తాయి.