ఏకాక్షి నారికేళం సాక్షాత్తు ల‌క్ష్మీదేవి స్వ‌రూప‌మ‌ని భావిస్తారు

0
175

ఏ కాక్షి నారికేళం అంటే ఒక కన్ను గల కొబ్బరికాయ అని అర్ధం. సాధారణంగా అన్ని కొబ్బరికాయలకి మూడు కళ్ళు ఉంటాయి. ఈ మూడు కళ్ళలో రెండు కళ్ళు గుండ్రంగాను ఒక కన్ను వెడల్పు గాను ఉంటుంది. వెడల్పుగా ఉన్న కన్నుని నోరుగాను గుండ్రంగా ఉన్న కళ్ళను రెండు కళ్ళ గాను చెబుతారు. ఏ కాక్షి నారికేళానికి ఒక కన్ను, ఒక నోరు ఉంటుంది. ఇవి దొరకటం చాలా కష్టం. వేలాది కొబ్బరికాయల్లో ఏ ఒక్కదాంట్లోను ఇలా రావచ్చు. మార్కెట్ లో తాటికాయలనే ఏకాక్షి నారికేళం గా అమ్ముతున్నారు. వీటితో పూజిస్తే ఫలితం శూన్యం. ఏ కాక్షి అంటే ఒక్కటే కన్ను ఉంటుందని అనుకుంటారు కాని ఏ కాక్షి నారికేళానికి ఒక కన్ను, ఒక నోరు ఖచ్చితంగా ఉంటాయి. 

పూజా విధానం;-
ఉదయాన్నే స్నానం చేసిన తరువాత ఏ కాక్షి నారికేళాన్ని శుభ్రమైన నీటితో గాని, గంగా జలంతో గాని కడిగి పసుపు, కుంకుమ, చందనములతో నారికేళాన్ని అలంకరించాలి. రాగి పాత్ర(చెంబు) గాని, అష్టలక్ష్మి పాత్రగాని తీసుకొని బియ్యముతో ఆపాత్రని నింపి నారికేళానికి పలుచటి పసుపు లేదా ఎరుపు వస్త్రాన్ని చుట్టి పాత్ర పైన ప్రతిష్టించాలి.
ఏ కాక్షి నారికేళానికి పూలు, అక్షింతలతో విష్ణు సహస్ర నామంతోను, లలితా సహాస్ర నామంతోను పూజ చేయాలి. ఈ పూజలో గవ్వలు, గోమతిచక్రాలకు కూడ పూజ చేయవచ్చు.
ఏ కాక్షి నారికేళాన్ని ఇంటి పూజా మందిరంలోగాని, షాపు పూజామందిరంలో గాని, విద్యా సంస్ధలలో గాని, ప్యాక్టరీలలోగాని దీనిని ప్రతిష్టించవచ్చు.
ఏకాక్షి నారికేళాన్ని శుక్రవారం గాని, దీపావళి రోజులలో గాని విశిష్ట పూజ చేస్తే మంచిది.

ఉపయోగాలు:-
* ఏకాక్షి నారికేళాన్ని పూజించేవారి ఇళ్లలోని కుటుంబ సభ్యులపై ఎటువంటి దుష్ప్రభావాలు పనిచేయవు. రోగాలు, కష్టాలు దూరమవుతాయి.
* ఏకాక్షి నారికేళాన్ని శివాలయంలో గాని, సుబ్రమణ్యేశ్వర ఆలయంలో గాని దానం చేసిన కోర్టు భాధలు, ఋణ భాదలు ఉండవు.
* ఏకాక్షి నారికేళం పూజ చేసే వారికి ఉద్యోగ రంగంలో ఉన్నత స్థానం కలుగుతుంది. పోటీ పరీక్షలలో విజయం సాదించవచ్చును.
* ఏకాక్షి నారికేళం ఉన్నచోట శత్రుభాదలు ఉండవు. బిడ్డలు కలగని స్త్రీకి ఏకాక్షి నారికేళాన్ని శుభ్రంగా నీటిలో కడిగి ఆ నీటిని తాగటం వలన గర్బప్రాప్తి కలుగుతుంది.
* ఏకాక్షి నారికేళం ఆయువృద్ధికి, ఐశ్వర్య వృద్ధికి హేతువు. ఏ కాక్షి నారికేళం ఎవరి ఇంట్లో అయితే ఉంటుందో దుష్టశక్తుల, నరదృష్టి ప్రభావం ఉండదు.
* ఏకాక్షి నారికేళం ఉన్న ఇంటిలో ఎటువంటి భాదలు గాని, గొడవలు గాని, అపోహలు గాని ఉండవు. కుటుంబ సభ్యులందరి మధ్య సహాయ సహాకారాలు, అన్యోన్యత, అనురాగాలు, ఆప్యాయతలు కలిగి ఉంటారు.
* ఏకాక్షి నారికేళం ఉన్న షాపులోగాని, ప్యాక్టరీలలో గాని, విధ్యా సంస్ధలలో గాని ఉంచి పూజ చేసిన ఆకర్షణ, మంచి కమ్యూనికేషన్, ధనాధాయాలు, వ్యాపారాభివృధ్ధి, మంచి వాక్ శుద్ధి, పిల్లలలో తెలివితేటలు, చదువు పై శ్రద్ధ, పోటితత్వం కలుగుతాయి.
* ఏకాక్షి నారికేళం ఉన్నచోట సర్వవిదాల అభివృద్ధి, సర్వకార్యసిద్ధి, జనాకర్షణ కలుగుతాయి.