ఆ భగవంతునికి కర్పూర హరతి ఇస్తే కానీ పూజ పూర్తికాదు అంటారు సంప్రదాయవాదులు. అలాంటి పచ్చ కర్పూరంలోఅనేక ఔషధ గుణాలు ఉన్నాయి. అవేంటో ఓసారి తెలుసుకుందాం.
* జీర్ణ సంబంధ, శ్వాసకోస సమస్యల్ని తగ్గించడంతో పాటు రక్తప్రసరణనూ మెరుగుపరుస్తుంది. కర్పూరం బ్యాక్టీరియాని, వైరల్ ఇన్ఫెక్షన్లనీ నివారిస్తుంది.
* నిద్ర లేమితో బాధపడేవారు చిటికెడు పచ్చకర్పూరాన్ని గోరువెచ్చని పాలల్లో కలిపి తాగితే నిద్ర పడుతుంది.
* మరిగించిన నీటిలో కాస్త కర్పూరాన్ని వేసి ఆవిరి పడితే జలుబు, దగ్గు తగ్గిపోతాయి. ఆస్తమా బాధితులకు మంచిది.
* లడ్డూ, పోంగలి, పరమాన్నం వంటి సంప్రదాయ మిఠాయిల తయారీలోనూ చిటికెడు పచ్చకర్పూరాన్ని జోడిస్తుంటారు.
* విక్స్, అమృతాంజన్ వంటి మందుల్లో దీని వాడకం ఎక్కువ. టూత్ పౌడర్లు, టూత్ పేస్టు తయారీలోనూ వాడుతారు.