ప్రతి ఒక్కరి లైంగిక సామార్థ్యం వారు తీసుకునే ఆహారంపై ఆధారపడి ఉంటుంది. ఈ విషయాన్ని పరిశోధకులు బల్లగుద్ది చెబుతున్నారు. పడక గదిలో దాంపత్య జీవితంలో తృప్తి పొందలేక పోతుంటే ఖచ్చితంగా తీసుకునే ఆహారంలో తేడా ఉన్నట్టు గుర్తించాలి.
లైంగిక సామర్థ్యాన్ని పెంచే ఆహార పదార్థాలలో తులసి, లవంగం, టమాట, ముల్లంగి, కోడిగుడ్డు, క్యారట్, పిల్లితీగలు, అల్లం, ఉల్లి, దోసకాయ, ఎర్రమిరియాలు, ఓట్లు, పిస్తా, చెస్ట్‌నట్, హాజల్‌నట్, కొబ్బరి, పుట్టగొడుగు ముఖ్యమైనవి. ముఖ్యంగా విటమిన్ ఇ ఉండే బాదం, వాల్‌నట్‌లు లైంగిక సామర్థ్యం పెరగడంలో అద్భుతంగా ఉపయోగపడుతాని అంటున్నారు.
లైంగిక శక్తికి ఎరుపు రంగుకు సంబంధం ఉందని కూడా పరిశోధకులు వివరిస్తున్నారు. ఎరుపు రంగులో ఉండే పదార్థాలు, శీతలపానీయాలు తీసుకుంటే లైంగిక సామర్థ్యం వృద్ధి చెందుతుందని అంటున్నారు. పగడం, రూబీ స్టోన్‌లు శక్తిని పెంచడంలో సహాయపడతాయని అందుకే వాటిని ధరించమని సూచిస్తుంటారు.
అనందకరమైన శృంగార జీవితాన్ని గడపటంతో విటమిన్‌ల పాత్ర కూడా కీలకమే. ముఖ్యంగా విటమిన్ ఇ పురుషులలో శక్తిని పెంచడానికి చాలా ఉపయోగపడుతుంది. లైంగిక సామర్థ్యం తక్కువగా ఉన్న వారు ప్రతి రోజు మంచి ఆహారంతో పాటు విటమిన్ ఇ కాప్యుల్స్‌ను కూడా తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.