పెళ్ళి పీటలెక్కనున్న ”సాహో” శ్రద్ధాకపూర్.. పెళ్లి కొడుకు ఎవరంటే?

0
39

బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాకపూర్, సైనా నెహ్వాల్ పాత్రలో కనిపించేందుకు శ్రద్ధాకపూర్ సిద్ధమైంది. కానీ అనుకోకుండా ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది. ఆ స్థానంలోకి బాలీవుడ్ హాట్ బ్యూటీ పరిణీతి చోప్రాను తీసుకున్నట్టు ప్రకటించింది చిత్ర బృందం.

బ్యాడ్మింటన్‌లో ట్రైనింగ్ తీసుకుని, వర్క్ షాప్ కూడా నిర్వహించిన తర్వాత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ బయోపిక్ నుంచి శ్రద్ధాకపూర్ తప్పుకోవడం హాట్ టాపిక్ అయ్యింది. అయితే శ్రద్ధా డేట్స్ కారణంగా షూటింగ్ బాగా ఆలస్యమవుతుండడమే ఈ మార్పుకు ప్రధాన కారణమని తెలుస్తోంది.

ప్రస్తుతం తెలుగులో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ‘సాహో’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది శ్రద్ధాకపూర్. ఈ నేపథ్యంలో ఈ ”సాహో” హీరోయిన్ శ్రద్ధా కపూర్ పెళ్లి పీటలెక్కబోతోందని బాలీవుడ్ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఓ ఫోటోగ్రాఫర్‌‌తో కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్న శ్రద్ధా ఆయన్నే వివాహం చేసుకోబోతోందని తెలుస్తోంది. శ్రద్ధా కపూర్ రోహన్ శ్రేష్ట అనే ఫోటోగ్రాఫర్‌తో చాలా కాలంగా డేటింగ్‌లో ఉందని సమాచారం.

2020లో శ్రద్ధ అతన్ని వివాహం చేసుకుని స్థిరపడాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటికే పెళ్లి చేసుకోవాలంటూ ఆమెపై ఇంట్లో వాళ్లు ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. రోహన్ ఇప్పటికే తన ఇంట్లో వారికి చెప్పి పెళ్లికి ఒప్పించినట్టు సమాచారం. అన్నీ అనుకున్నట్టు జరిగితే 2020లో శ్రద్ధా, రోహన్ పెళ్లి పీటలెక్కుతారని బిటౌన్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. మరి ఈ వార్తల్లో ఎంత నిజముందే తెలియాలంటే వేచి చూడాలి.