ఫోటో గ్రాఫర్‌తో సాహో భామ పెళ్లి

0
43
Shraddha Kapoor
Shraddha Kapoor

ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం సాహో. ఈ చిత్రంలో హీరోయిన్‌గా బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ నటిస్తోంది. ఈమె త్వరలోనే పెళ్లి చేసుకోనుందట. దీనికి కారణం.. ఈమె గత కొంతకాలంగా ఓ ఫోటోగ్రాఫర్‌తో డేటింగ్‌లో ఉందట. ఇపుడు ఆ ఫోటోగ్రాఫర్‌నే పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకుందట.

ఆ ఫోటోగ్రాఫర్ పేరు రోహన్ శ్రేష్ట. గత కొంతకాలంగా ఈయనతో శ్రద్ధా డేటింగ్‌లో ఉందట. 2020లో శ్రద్ధ అతన్ని వివాహం చేసుకుని స్థిరపడాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటికే పెళ్లి చేసుకోవాలంటూ ఆమెపై ఇంట్లో వాళ్లు ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. రోహన్ ఇప్పటికే తన ఇంట్లో వారికి చెప్పి పెళ్లికి ఒప్పించినట్టు సమాచారం. అన్నీ అనుకున్నట్టు జరిగితే 2020లో శ్రద్ధా, రోహన్ పెళ్లి పీటలెక్కుతారు.