వారిద్దరితో ఛాన్స్ వచ్చింది కానీ.. వేయించుకోలేక పోయా.. హీరోయిన్

0
43
priya raman
priya raman

వివిధ భాషల్లో కథానాయికగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రియా రామన్. ఈమె తాజాగా ఆమె ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా అనేక విషయాలను సరదాగా వెల్లడించింది.

తన సినీ కెరియర్ ఆరంభంలోనే నేను రజనీకాంత్.. కమల్ హాసన్ వంటి అగ్రకథానాయకులతో కలిసి నటించాను. తెలుగులో చిరంజీవి .. బాలకృష్ణ .. నాగార్జున .. వెంకటేశ్ వంటి స్టార్ హీరోల సరసన నటించలేకపోయాను. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావుగారు రెండు .. మూడు సినిమాల నిర్మాణం సమయంలో నాకు కాల్ చేయించారు. కానీ నాకు డేట్స్ కుదరకపోవడం వలన చేయలేకపోయాను.

‘హిట్లర్’ మూవీలో ‘రంభ’ చేసిన పాత్రకిగాను ముందుగా నన్ను సంప్రదించారు. నేనప్పుడు విదేశాల్లో ఉండటం వలన కుదరలేదు. నాగార్జున గారు హీరోగా చేసిన ‘క్రిమినల్’ సినిమా కోసం కూడా నన్ను అడిగారు. అది చేయడం కూడా కుదరలేదు. ఇలా అవకాశాలు వచ్చాయిగానీ చేయలేకపోయాను అని చెప్పుకొచ్చారు.