దండుపాళ్యెం హీరోయిన్ అలా చేసిందేంటి?

0
38
Pooja Gandhi
Pooja Gandhi

కన్నడ నటి ఒకరు పత్తాలేకుండా పారిపోయారు. ఆమె బస చేసిన హోటల్ బిల్లు చెల్లించలేక ఈ పనికిపాల్పడ్డారు. దీంతో హోటల్ యాజమాన్యం ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వివరాలను పరిశీలిస్తే,

ప్రముఖ కన్నడ నటి పూజా గాంధీ బెంగుళూరులోని ఓ లగ్జరీ హోట‌ల్‌లో బసచేసింది. ఆమె కొన్ని రోజుల పాటు ఆ హోటల్‌లో ఉండటంతో బిల్లు దాదాపు రూ.4.5 లక్షలు అయింది. ఈ విషయం తెలుసుకున్న పూజా హోటల్ నుంచి మెల్లిగా జారుకుంది. దీంతో హోటల్ యాజమాన్యం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

పూజాకు పోలీసులు సమన్లు జారీ చేశారు. అయితే తాను రూ.2 లక్షలు చెల్లించానని, మిగిలినవి కాస్త గడువిస్తే చెల్లిస్తానని హోటల్ యాజమాన్యాన్ని కోరినట్టు తెలుస్తోంది. దీంతో హోటల్ యాజమాన్యం కూడా ఆమెకు గడువిచ్చినట్టు తెలుస్తోంది.