నా మాటలు ఓపిగ్గా వినే వ్యక్తితో డేటింగ్ చేస్తా : నిహారిక

0
37
Niharika
Niharika

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏకైక హీరోయిన్ నిహారిక. ఈమె గతంలో రెండుమూడు చిత్రాల్లో నటించింది. కానీ, పెద్దగా క్లిక్ కాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె సూర్యకాంతం అనే చిత్రంలో నటించింది. ఈ చిత్రం ఈనెల 29వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది.

ప్రస్తుతం ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో నిహారికతో పాటు యూనిట్ సభ్యులు బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా ’60 సెకండ్స్ విత్ నిహారిక’ కార్యక్రమంలో తనకు వచ్చిన పలు ప్రశ్నలకు ఆమె చిలిపి సమాధానాలు ఇచ్చారు.

‘సూర్యకాంతంలాగానే నేను కూడా స్వార్థ స్వభావం కలిగిన అమ్మాయిని. ప్రేమకు సంబంధించిన హ్యాష్ ట్యాగ్‌లు నాకు నచ్చవు. డేటింగ్ చేయాల్సి వస్తే… నా మాటను ఓపికగా వినే వ్యక్తిని ఎంచుకుంటా. ఎమోషన్స్ ఎక్కువగా ఉన్న సమయంలో ఫసక్ అనే పదాన్ని వాడవచ్చు. గతంలో ఒక సారి రెండు రోజులు స్నానం చేయకుండా ఉన్నా’ అని చెప్పుకొచ్చారు.