మనస్సులో వున్న విషయాన్ని బహిరంగంగా చెప్పేసే అందాల ముద్దుగుమ్మ రాధికా ఆప్టేకు కూడా డ్రీమ్ బాయ్ వున్నాడట. తాజాగా ఆమె ‘ఓ మై హృతిక్’ అనే కార్యక్రమానికి మద్దతు తెలుపుతూ ఓ ఆసక్తికరమైన విషయాన్ని మీడియాతో పంచుకుంది.
తాను చదువుకునే రోజుల్లో ఓ అబ్బాయిని ఇష్టపడ్డానని, అతను కలలోకి వస్తాడని త్వరగా నిద్ర పోయేదాన్నని వివరించింది. సినిమాలు చూస్తూ తనను తాను హీరోయిన్లా భావించేదానన్ని తెలిపింది. తన ఇంటి పనిమనిషితో కలిసి సినిమాలు చూసేదాన్నని.. కొన్ని పాటల్లో వర్షం పడుతున్నప్పుడు హీరోయిన్ చీరకొంగు గాలికి ఎగరడం, ఆ తర్వాత హీరో వచ్చి ఆమెతో పాటలు పాడుతూ చిందులేయడం ఎక్కువగా ఉండేవి. తాను కూడా తనను హీరోయిన్లా ఊహించుకునేదాన్ని అంటూ రాధికా ఆప్టే వెల్లడించింది.
అలా మా క్లాస్లో ఒక అబ్బాయిని ఇష్టపడ్డాను. తాను కూడా చీరకట్టుకుని వర్షంలో తడుస్తున్నప్పుడు అతను తనతో డ్యూయెట్లు పాడితే బాగుండునని ఊహించుకునేదాన్ని. అది ఎప్పుడూ జరగలేదు. అందుకే కనీసం కలలో అయినా తాను అనుకున్నది జరగాలని అతని కోసమే త్వరగా నిద్రపోయేదానిని అంటూ రాధికా ఆప్టే వెల్లడించింది.