ఆరు వరుస పరాజయాలు… లక్ కోసం పేరు మార్చుకున్న హీరో..

0
86
sai tej
sai tej

మెగా ఫ్యామిలీ హీరో సాయి ధరమ్ తేజ్. తన సినీ కేరీర్‌లో అద్భుతమైన హిట్స్ ఇచ్చాడు. మరో మాస్ మహారాజాగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ఆయనకు కాలం కలిసిరాలేదు. ఫలితంగా వరుసగా ఆరు చిత్రాలు పరాజయాలు ఎదురయ్యాయి.

దీంతో ఈసారి చేయబోయే సినిమా తప్పక హిట్ అవ్వాలని పట్టుదలగా ఉన్నాడు. అందుకోసం లుక్ దగ్గర్నుండి స్టోరీ సెలెక్షన్ వరకు అన్నీ మార్చుకున్నాడు. చివరికి స్క్రీన్ నేమ్ కూడా. తేజ్ గత సినిమాలన్నిటిలోనూ ఆయన స్క్రీన్ నేమ్ సాయి ధరమ్ తేజ్ అని పడేది.

కానీ, ఆయన నటించిన తాజా చిత్రం ‘చిత్రలహరి’కి మాత్రం సాయి తేజ్ అని పడుతోంది. ఇటీవల విడుదలైన సినిమా పాటను చూస్తే ఈ సంగతి తెలుస్తుంది. ఇలా పేరును ట్రిమ్ చేయడం వెనక లక్ అనే అంశం ఉందని ఇండస్ట్రీ టాక్. మరి చూడాలి ఈ కొత్త పేరు మెగా హీరోకి ఎలా కలిసొస్తుందో.