కోహ్లీకి అంత సీన్ లేదయ్యా.. ధోనీ, రోహిత్ శర్మలే గొప్ప కెప్టెన్లు..?

0
49
virat kohli
virat kohli

టీమిండియాకు సారథిగా విరాట్ కోహ్లీ సరిపోడని, విరాట్ కోహ్లీ కంటే ధోనీ, రోహిత్ శర్మలే గొప్ప కెప్టెన్లని టీమిండియా మాజీ ఆటగాడు గౌతం గంభీర్ అభిప్రాయపడ్డాడు. ఇందుకు ఐపీఎల్‌లో కోహ్లీ ఒక కప్పును కూడా జట్టుకు సంపాదించి పెట్టారని గంభీర్ వ్యాఖ్యానించాడు.

ఐపీఎల్‌లో ధోనీ, రోహిత్ లు కెప్టెన్లుగా తమ చెన్నై, ముంబై జట్లకు మూడేసి టైటిళ్లను అందించారని… బెంగళూరు సారథిగా కోహ్లీ ఇప్పటి వరకు ఒక టైటిల్ కూడా అందుకోలేకపోయాడని గంభీర్ చెప్పాడు. కోహ్లీ తనకు అంత చురుకైన కెప్టెన్‌గా కనిపించడని, గొప్ప వ్యూహాలను కూడా రచించలేడని ఎద్దేవా చేశాడు. క్రికెట్‌లో కోహ్లీ ఇంకా చాలాదూరం ప్రయాణించాల్సి ఉందని అన్నాడు.

ఏడెనిమిదేళ్లుగా బెంగళూరు జట్టుకు కెప్టెన్సీ వహిస్తూ, ఇంతవరకు ఒక్క టైటిల్ ను కూడా గెలవని కోహ్లీని ఆ ఫ్రాంఛైజీ ఇంకా కెప్టెన్‌గా కొనసాగిస్తుండటం గొప్ప విషయమేనని గంభీర్ వ్యాఖ్యానించాడు.