యూరోపియన్ యూనియన్ (ఈయూ) ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్‌పై భారీ జరిమానా విధించింది. గూగుల్ రూ.11,000 కోట్ల జరిమానా చెల్లించాలని ఈయూ వడ్డించింది.
గత రెండేళ్లలో ఈయూ చేతిలో గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ ఎదుర్కొన్న మూడో అతిపెద్ద జరిమానా ఇది. గతేడాది కూడా ఇదే విషయమై ఈయూ గూగుల్‌పై 4.34 బిలియన్ యూరోల జరిమానా విధించింది. అంతకుముందు, 2017లో 2.42 యూరోల జరిమానా వడ్డించారు.
ఇంతకీ విషయం ఏంటంటే.. తన సెర్చింజిన్‌లో ప్రత్యర్థుల యాడ్స్ బ్లాక్ చేస్తోందంటూ వెల్లువెత్తిన ఆరోపణలపై విచారణ జరిపిన ఈయూ తాజాగా గూగుల్‌పై జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఆన్‌లైన్ సెర్చ్ వాణిజ్య ప్రకటనల రంగంలో గూగుల్ తన స్థానాన్ని ఇప్పటికే తిరుగులేని విధంగా పటిష్ఠం చేసుకుందని, అయితే, థర్డ్ పార్టీ వెబ్ సైట్ల నుంచి ఎదురయ్యే పోటీనుంచి తనను తాను రక్షించుకోవడానికి కఠిన ఆంక్షలను కవచంగా మార్చుకుంటోందని ఈయూ వివరించింది.