జనసేన గురించి అప్పుడే పవన్‌కు చెప్పాను.. జయప్రకాశ్ నారాయణ

0
76
jayaprakash - pawan
jayaprakash - pawan

ప్రముఖ నటుడు, నిర్మాత నాగబాబు జనసేన పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్న నాగబాబుకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం పవన్ మాట్లాడుతూ.. ప్రస్తుతం తనకున్న రాజకీయ చైతన్యం నాగబాబు వల్లే మొదలయిందని తెలిపారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో తన సోదరుడు నాగబాబును దొడ్డిదారిన కాకుండా నేరుగా ప్రజా క్షేత్రంలో నిలబెడుతున్నానని వ్యాఖ్యానించారు

మరికొన్ని రోజుల్లో ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 11న లోక్ సభ ఎన్నికలతో పాటే అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహిస్తున్నారు. ఈసారి రాష్ట్రంలో త్రిముఖ పోటీ ఏర్పడింది. ప్రధాన పార్టీలైన టీడీపీ, వైఎస్సార్సీపీలతో పాటు జనసేన కూడా రేసులో నిలిచింది.

అయితే, ఎంతో బలంగా ఉన్న టీడీపీ, వైఎస్సార్సీపీ గెలుపు కోసం ఉరకలు వేస్తున్న తరుణంలో జనసేన పార్టీ ఈ ఎన్నికల్లో ఓట్లను చీల్చి ఏ విధంగా సత్తా చాటుతుందనే ప్రశ్నకు లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ్ సమాధానమిచ్చారు. తాను ఇదే విషయాన్ని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు కూడా విడమర్చి చెప్పానని వెల్లడించారు.

రాష్ట్రంలో పవన్ ప్రభావం గణనీయస్థాయిలో ఉండకపోవచ్చని, మూడో పార్టీగా ఉన్న జనసేనకు కష్టకాలం తప్పదని గతంలోనే హెచ్చరించానని జేపీ తెలిపారు. ఎన్ని ఓట్లు వస్తాయన్నది ప్రజలే నిర్ణయిస్తారని ఈ మాజీ ఐఏఎస్ అధికారి పేర్కొన్నారు.