నిన్ను చంపి నీ భార్యను నాకాడ పెట్టుకుంటా.. సీఐ చిట్టెం

0
216

వైసీపీ బాపట్ల ఎంపీ అభ్యర్థి నందిగామ సురేష్ మంగళగిరి రూరల్ సీఐ చిట్టెం కోటేశ్వరరావు వేధింపులపై ఆవేదన వ్యక్తం చేశారు. రివాల్వర్ నోట్లో పెట్టి హింసించారని… అతనిప్పుడు బాపట్ల సీఐగా వున్నారని తెలిపారు. అమరావతి పంటపొలాల దగ్ధం కేసులో తన పాత్రపై సాక్ష్యాలు ఉన్నట్లు కోటేశ్వరరావు చెప్పారని, అయితే సాక్ష్యాల ఆధారంగానే కేసు పెట్టాలని తాను కోరానన్నారు. దీంతో కోపంతో ఊగిపోయిన సీఐ నోటికొచ్చినట్లు మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు.

లాజిక్కులు మాట్లాడుతున్నావేంట్రా? అని కాలితో ఎగిరితన్నాడని వాపోయారు. సీఐ చిట్టెం కోటేశ్వరరావు ఎగిరి తన్నడంతో తాను మరేం మాట్లాడలేక మౌనంగా ఉండిపోయానని తెలిపారు. తనకు జరిగిన అవమానం మరెవరికీ జరగలేదన్నారు. కాళ్లతో తన్నడమే కాకుండా తిట్టకూడని మాటలన్నీ తిట్టారు.

“నిన్ను చంపి నీ భార్యను నాకాడ పెట్టుకుంటా” అని చెప్పారని.. ఇంతకంటే అవమానం ఉంటుందా? అని సురేష్ కన్నీటిపర్యంతమయ్యారు. టీడీపీలోకి వస్తే ఏ బాధ వుండదని.. వైకాపా చీఫ్‌ను నమ్ముకుంటే వట్టి చేతులే మిగులుతాయని సీఐ బెదిరించినట్లు చెప్పారు.