బాలీవుడ్ చిత్రంలో కల్నల్‌గా రానా దగ్గుబాటి

Rana Daggubati roped in for Ajay Devgn' film

0
49
rana daggubati
rana daggubati

టాలీవుడ్ హీరో దగ్గుబాటి రానా. అటు టాలీవుడ్, ఇటు కోలీవుడ్ చిత్ర పరిశ్రమల్లో బిజీగా ఉన్నాడు. మరోవైపు బాలీవుడ్ చిత్ర పరిశ్రమపై కూడా కన్నేశాడు. దీంతో ఆయనకు సినీ అవకాశాలు పుష్కలంగా వస్తున్నాయి.

ఇటీవలే ఆయన ‘హౌస్ ఫుల్ 4’ సినిమాలో ఛాన్స్ దక్కించుకున్నాడు. తాజాగా హిందీలో రూపొందనున్న మరో భారీ బడ్జెట్ సినిమాలోను ఆయనకి అవకాశం దక్కింది.

‘భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం రానాను తీసుకున్నారు. దేశభక్తి నేపథ్యంలో సాగే ఈ సినిమాలో రానా .. కల్నల్‌గా కనిపించనున్నాడు.

ఈ చిత్రాన్ని రూ.150 కోట్ల బడ్జెట్‌తో నిర్మించనున్నారు. ఇందులో అజయ్ దేవగణ్ హీరోగా నటిస్తుండగా, సంజయ్ దత్ .. సోనాక్షి సిన్హా, పరిణీతి చోప్రా ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. అభిషేక్ దుదానియా దర్శకత్వం వహిస్తున్నారు.