మార్చి నెలాఖరులో నాలుగు సినిమాల సందడి

0
68

మార్చి నెలాఖరులో వరుసగా నాలుగు చిత్రాలు రిలీజ్ కానున్నాయి. వాస్తవానికి ఈనెలలో ఇప్పటివరకు విడుదలైన చిత్రాల్లో ఏ ఒక్కటి కూడా సరైన హిట్ టాక్‌ను తెచ్చుకోలేకపోయింది. కొన్ని బాగున్నాయని టాక్ వచ్చినా.. సరైన ప్రమోషన్స్ లేక రేస్‌లో వెనకబడ్డాయి.

ఈ నేపథ్యంలో ఈనెలాఖరులో వరుసగా నాలుగు చిత్రాలు విడుదలకానున్నాయి. ఇందులో ముందుగా చెప్పుకోవలసింది “చీకటిగదిలో చితక్కొట్టుడు” సినిమా గురించే. పక్కా అడల్ట్ కంటెంట్‌తో తెరకెక్కిన ఈ మసాలా సినిమాలో బూతు తప్ప మరొకటి కనిపించదు. ఫ్యామిలీ ఆడియన్స్, పిల్లలు ఈ సినిమాకు వెళ్లేందుకు ఆసక్తి చూపించరు. కేవలం యూత్ మాత్రమే ఈ సినిమాకు ఎట్రాక్ట్ అవుతుంది. హిట్టయ్యే ఛాన్స్ లేకపోయినా పెట్టిన డబ్బులు వెనక్కి రావడం ఖాయం.

ఇకపోతే, అదే రోజున అంటే మార్చి 21 వ తేదీన “సువర్ణ సుందరి” చిత్రం రిలీజ్ కానుంది. సాక్షి చౌదరి, జయప్రద వంటి తారలు నటించిన ఈ సినిమాలో కళ్ళు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నాయని అంటున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి ప్రమోషన్ స్టార్ట్ చేయలేదు.

మార్చి 29వ తేదీన చాలా కీలకమైన రోజు. ఆరోజున వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ స్వీయ దర్శకత్వంలో నిర్మితమైన చిత్రం “లక్ష్మీస్ ఎన్టీఆర్”. ఎన్నో వివాదాల తర్వాత ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ సినిమాను రిలీజ్ చేయకుండా ఆపేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రయత్నం చేసినా అవి ఫలించేలా లేవు. ఒకవేళ రిలీజ్ కాకుండా అడ్డుకుంటే సినిమాను యూట్యూబ్‌లో ఫ్రీగా చూసే విధంగా అప్లోడ్ చేస్తారట.

ఇదే రోజున మెగా డాటర్ నిహారిక ప్రధాన పాత్రలో నటించిన చిత్రం సూర్యకాంతం. హీరో నిఖిల్ ‘అర్జున్ సురవరం’ వంటి సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఈ రెండు వారాల్లో రిలీజ్ కాబోయే సినిమాల్లో ఏ సినిమా హిట్ అవుతుందో.. ఏది ఫట్ అవుతుందో తెలియాలంటే మరో రెండు వారాలు ఆగాల్సిందే.